ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి ... ఉత్తమ్-రేవంత్

రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసిన ..ఉత్తమ్ కుమార్ రెడ్డి,రేవంత్ రెడ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ లు

నెహ్రు, గాంధీ కుటుంబం చేసిన సేవలను నేడు మోడీ ప్రభుత్వం వక్రీకరించి స్వార్థ బుద్ధితో దేశాన్ని మత పరంగా విభజిస్తుంది

  • Share this:
    కరీంనగర్ జిల్లా : భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 29వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలుగునూర్లో తెలంగాణ రాష్ట్ర టి.పి.సి.సి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,రేవంత్ రెడ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ లు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సంధర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని, దేశంలో యువతకు ఓటుహక్కును కల్పించడంలోను,రాజ్యాంగంలోని 73వ ఆర్టికల్ ద్వారా లోకల్ బాడీలకు నేరుగా కేంద్ర నిధులు వచ్చే విధంగా కృషి చేశారని, అన్ని కుల, మతాలను సమానంగా ప్రోత్సహిస్తూ పరిపాలన కొనసాగించారని, భారతదేశంలో నెహ్రు, గాంధీ కుటుంబం చేసిన సేవలను నేడు మోడీ ప్రభుత్వం వక్రీకరించి స్వార్థ బుద్ధితో దేశాన్ని మత పరంగా విభజించి కుల,మతపరమైన పాలన కొనసాగిస్తున్నారని, ప్రజలు వచ్చే ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారని అన్నారు..

    రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రాన్ని ప్రజలను మాటల గారడీతో మభ్యపెడుతూ పరిపాలన కొనసాగిస్తున్నారని దానికి నిదర్శనం ఈరోజు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టులు అన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నిర్మించినవే నని అందులోకి వర్షాలు సమృద్ధిగా కురవడం వలన ప్రాజెక్టులోకి మీరు వచ్చాక వాటిని ప్రచారం చేయకుండా మడుగులోకి నీరు వచ్చాక అక్కడ ఫోటోలు దిగి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఎద్దేవాచేశారు...
    Published by:Venu Gopal
    First published: