THE SAINT TOLD THE CENTER THAT INDIA SHOULD BE DECLARED A HINDU STATE BY OCTOBER 2 AS WELL AS THE CITIZENSHIP OF MUSLIMS SHOULD BE REVOKED OR ELSE HE WOULD TAKE JAL SAMADHI IN SARAYU RIVER PRV
Hindu Rasthra: ‘‘భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి.. ముస్లింలకు పౌరసత్వాన్ని రద్దు చేయాలి.. లేకపోతే జల సమాధి అవుతా” సాధువు సంచలన హెచ్చరిక
జగద్గురు పరమహంస్ ఆచార్య మహారాజ్ (Photo: ANI ?Twitter)
భారతదేశాన్ని (India) హిందూ దేశం (Hindu country)గా ప్రకటించకపోతే జలసమాధి అవుతానని హెచ్చరించారు జగద్గురు పరమహంస్ ఆచార్య మహారాజ్. అంతేకాదు ముస్లిం (Muslim), క్రిస్టియన్ల (Christians)కు పౌరసత్వం (citizenship) తీసేయాలని సైతం డిమాండ్ (demand) చేశారు. అంతటితో ఆగలేదు. ఇదంతా అక్టోబర్ 1వ తేదీన జరిగిపోవాలని లేకపోతే అక్టోబర్ రెండో తేదీన జలసమాధి అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగద్గురు పరమహంస్ ఆచార్య మహారాజ్ (Jagadguru Paramhans Acharya Maharaj). అయోధ్య (Ayodhya) లోని తపస్వీ కంటోన్మెంట్ సాధువు. అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తారు. ఈ సారి కూడా ఓ ప్రకటన చేసి దుమారమే రేపారు. భారతదేశాన్ని (India) హిందూ దేశం (Hindu Rasthra)గా ప్రకటించకపోతే జలసమాధి అవుతానని హెచ్చరించారు. అంతేకాదు ముస్లిం (Muslim), క్రిస్టియన్ల (Christians)కు పౌరసత్వం (citizenship) తీసేయాలని సైతం డిమాండ్ (demand) చేశారు. అంతటితో ఆగలేదు. ఇదంతా అక్టోబర్ 1వ తేదీన జరిగిపోవాలని లేకపోతే అక్టోబర్ 2వ తేదీన జల సమాధి (samadhi) అవుతానని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 1న భారీ ఎత్తున సనాతన ధర్మ సంసద్ నిర్వహించనున్నారని, అయితే ఈ సంసద్‌లో భారతదేశాన్ని హిందూ దేశం (Hindu country)గా చేయడంపై చర్చ జరుగుతుందని పరమహంస్ వెల్లడించారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం (central government) అప్పటిలోగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే అక్టోబర్ 2న సరయు నదిలో మునిగి జల సమాధి (samadhi) అవుతానని హెచ్చరించారు.
ప్రధానికి లేఖ..
అయితే ఈ జగద్గురు పరమహంస (Jagadguru Paramhans). గతంలోనూ ఓ సంచలన నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు. కొన్ని నెలల క్రితం ప్రధాని (Prime minister), హోం మంత్రికి ఓ లేఖను కూడా పంపారు పరమహంస. దానిలో ఆయన స్వీయ మరణాన్ని ప్రకటించారు. అయితే లేఖ (letter)ను అందుకున్న పోలీసులు (police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దాంతో ఆ వివాదం సద్దుమణిగింది. కానీ, ఇపుడు ఏకంగా దేశాన్నే హిందూ దేశంగా మార్చాలంటూ... అందులోనూ ముస్లింలను, క్రిస్టియన్ల పౌరసత్వాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తుండటం చర్చనీయాంశమైంది. లేకపోతే జల సమాధి చేసుకుంటానని హెచ్చరిక సైతం జారీ చేశారు. అయితే దీనికోసం తన కార్యకలాపాలు కూడా సిద్దం చేసుకున్నట్లు తెలిసింది.
నా సమాధి తర్వాత అయినా..
అయితే భారతదేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ కలిసి జీవిస్తున్నారని, మీరు హిందూ దేశాన్ని ప్రకటించాలని చెప్తున్నారెందుకని, ఒకవేళ అది నేరవేరకపోతే ఏం చేస్తారని సంత్ పరమహంసను మీడియా ప్రతినిధులు అడిగారు. దీనిపై స్పందించిన సంత్ పరమహంస్.. అక్టోబర్ 1 న అన్ని సంస్థల ప్రజలు హిందూ సనాతన ధర్మ సంసద్‌ను నిర్వహిస్తారని, అక్టోబర్ 2 న తన ఆకాంక్ష పట్టించుకోకపోతే.. సరయు నదిలో నీటి సమాధి అవుతా అని చెప్పారు. ‘‘బహుశా నేను సమాధి అయిన తర్వాత.. నా నివాళిగా, మోదీ జీ (modi ji), భారతదేశాన్ని హిందూ దేశంగా చేయండి, ఎందుకంటే హిందువు (Hindu) లేనప్పుడు, ఏమీ మిగలదు” అన్నారు.
Ayodhya | I demand that India should be declared a ‘Hindu Rashtra’ by Oct 2 or else I'll take Jal Samadhi in river Sarayu. And Centre should terminate nationality of Muslims & Christians: Jagadguru Paramhans Acharya Maharaj (28.09) pic.twitter.com/QMAIkd6tLZ
అన్ని కుల మతాల ప్రజలు కలిసి ఇక్కడ నివసిస్తున్నారని మీ డిమాండ్లు నెరవేర్చితే అప్పుడు.. మన ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తుందని మీడియా ప్రతినిధులు అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా.. ‘‘రాజ్యాంగం, కోర్టులు చూడండి, ప్రజాస్వామ్యం ఉంది. హిందువులు మెజారిటీలో ఉన్నంత వరకు, ప్రతిదీ అక్కడే ఉంటుంది.. హిందూ చాలా స్వేచ్ఛగా ఉంది, హిందూ రాష్ట్రాన్ని ప్రకటించినప్పటికీ, ఇతరులు బాధపడరు ”అన్నారు
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.