THE ROUND OF NOMINATIONS ENDED APPEASING LEADERS IN KHAMMAM VB KMM
Muncipal elections: ఖిల్లాలో పొడవని పొత్తులు.. ముగిసిన నామినేషన్ల పర్వం.. రెబల్స్ ను బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు..
khammam elections
Muncipal elections: ఖమ్మం ఖిల్లాపై ఎగిరే జెండా ఎవరిది? తెరాస దూసుకుపోతుందా? కాంగ్రెస్ తన ప్రతిష్ట నిలుపుకుంటుందా? తెరాసతో జత కట్టడానికి ఉవ్విళ్లూరుతున్న కామ్రేడ్ల పరిస్థితేంటి? భాజపా ఖాతా తెరుస్తుందా? పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్, సిపిఎం, టీడీపీ కలసి పోటీచేస్తాయని ప్రచారం జరిగినా అవి ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు.
(జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా, న్యూస్ 18 తెలుగు)
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వివిధ పార్టీల నుంచి పోటీచేసే వాళ్లు తమమద్దతు దార్లతో కలిసి ప్రదర్శనలు.. ర్యాలీలతో నామినేషన్ సెంటర్ కు వెళ్లి నామినేషన్ వేశారు . కాంగ్రెస్ సిపిఎం ,టీడీపీ కలసి పోటీచేస్తాయని ప్రచారం జరిగినా అవి ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఎవరితో పొత్తులకు వెళ్ళటం లేదని ప్రకటించింది. టీడీపీ కి ఇటీవలనే చాలామంది రాజీనామా చేసి మంత్రి అజయ్ నాయకత్వంలో టీఆర్ యస్ లో చేరారు. కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు ఉంటుందని చెబుతున్న రెండు పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. టీడీపీ ని కలిసి రావాలని కోరుతున్నారు. సిపిఎం 30 డివిజన్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది . మరో 30 డివిజన్లలో ఎవరికీ మద్దతు ఇవ్వబోతుందో స్పష్టం చేయలేదు. బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేన 12 డివిజన్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది . సిపిఐ , టీఆర్ యస్ కలిసి నడిచేందుకు నిర్ణయించుకోగా వారికీ 3 డివిజన్లలో పోటీకి టీఆర్ యస్ ఆవకాశం కల్పించింది.
కాని సిపిఐ మరో రెండు డివిజన్లలో అదనంగా నామినేషన్లు వేసింది. కనీసం ఒక్క డివిజన్ అయినా తమకు వదులు తారనే ఆశతో ఉంది. సిపిఐ నామినేషన్లు వేసిన డివిజన్లలో 19 ,43 ,60 15 ,50 ఉన్నాయి . ఇక సిపిఎం 30 డివిజన్లకు పోటీచేస్తున్నట్లు ప్రకటించింది. కాని 35 సిపిఎం అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు అధికారులు ప్రకటించారు. సిపిఎం పోటీచేసే డివిజన్లలు 1 , 2 ,14 ,15 ,60 , 5 ,6 ,7 ,53 23 ,25 ,37 ,40 ,42 ,43 44 , 50 ,52 , 17 27 28 ,29 ,30 ,31 32 ,33 ,34 ,35 .36 ,48 , ఉన్నాయి . మొత్తం 60 డివిజన్లకు గాను 522 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో కాంగ్రెస్ 125 టీఆర్ యస్ 163, టీడీపీ 16 ,జనసేన 12 బీజేపీ 84 , సీపీఐ 7, ఇతరులు 92 లు మరికొందరు ఇండిపెండెంట్ లు ఉన్నారు. నామినేషన్లు వేసినవారిలో మంత్రి పువ్వాడ అజయ్ సతీమణి వసంత లక్ష్మి ఉన్నారు. ఖమ్మం కార్పొరేషన్ జనరల్ మహిళకు రిజర్వేషన్ అయిన సంగతి విదితమే .
అయితే అధికార పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన వాళ్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మొత్తంమీద ప్రతిపక్షాల అనైక్యత తెరాసకు వరంగా మారింది. టికెట్ వస్తే గెలిచినట్టేనన్న భావన అభ్యర్ధలలో ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు మరో మూడు రోజులు సమయం ఉండగా పార్టీల పెద్దలు రెబెల్స్ ను బుజ్జగించే పనిలో ఉన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.