• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • THE POOREST CANDIDATE IN CHHATTISGARH ELECTIONS WITH 1200 ASSETS IS TAKING ON CM RAMAN SINGH

ఆమె ఆస్తి రూ.1200, ముఖ్యమంత్రి మీదే పోటీ

ఆమె ఆస్తి రూ.1200, ముఖ్యమంత్రి మీదే పోటీ

ప్రతిమ వాస్నిక్ ప్రచార చిత్రం

సీఎం రమణసింగ్ ఆస్తులు రూ.10 కోట్లు, ఆయనపై పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి ఆస్తులు రూ.3కోట్లు, కానీ, ఈమె ఆస్తి మాత్రం రూ.1200.

  • Share this:
    ఎన్నికలంటే డబ్బు. కనీసం నాలుగైదు కోట్లు లేనిదే ఎక్కడా ఎన్నికల్లో బరిలో దిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో డబ్బే ప్రధానం. డబ్బును మించిన ఆయుధం లేకుండా పోయింది. అయితే, కేవలం రూ.1200 ఆస్తులతో, బ్యాంకులో రూ.20వేల క్యాష్‌తో ఆమె బరిలో దిగింది. ఏదో ఓ మారుమూల నియోజకవర్గంలో కాదు. ఏకంగా ముఖ్యమంత్రి మీదే పోటీకి నిలిచింది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఈ ధీర వనిత స్టోరీ హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె పేరు ప్రతిమ వాస్నిక్. వయసు 37 ఏళ్లు.

    ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రమణసింగ్ పోటీలో ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసిన సీఎం రమణసింగ్ తనకు రూ.10.72 కోట్లు ఆస్తులు ఉన్నట్టు చెప్పారు. అదే సమయంలో రమణసింగ్ మీద పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ప్రధాని వాజ్‌పేయి మేనకోడలు కరుణా శుక్లా, తనకు సుమారు రూ.3కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. అలాంటి హేమాహేమీల మీద పోటీకి దిగిన ప్రతిమ వాస్నిక్ మాత్రం తనకు రూ.1200 ఆస్తి,రూ.20వేల నగదు ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రతిమ భర్త సంతోష్ వాస్నిక్ ఓ కుక్. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. సమాజాన్ని మార్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రతిమ చెబుతున్నారు.

    ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు గుర్తింపు కార్డులు, ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్‌లో రిజర్వేషన్లు, రోడ్డు, నీరు, విద్యుత్ సరఫరా మెరుగుదల, గోధుమలకు క్వింటాకు రూ.2000 మద్దతు ధర ఆమె ప్రధాన నినాదాల్లో కొన్ని. ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో దళితుల ప్రభావం బలంగా ఉంది. అంబేద్కర్ వాదం మనసులో ఉంది. ప్రధానంగా సత్నామి సామాజికవర్గం ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే శక్తి ఉంది. అంబేద్కర్ తర్వాత దళితులు ఎక్కువగా అభిమానించే బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కూడా తొలిసారి ఛత్తీస్‌గఢ్ నుంచే లోక్‌సభకు పోటీ చేశారు. గత మూడు ఎన్నికల్లో బీఎస్పీ సుమారు 5శాతం ఓట్ బ్యాంక్‌ను సాధిస్తోంది. అయితే, ఈ సారి మాయావతి, అజిత్ జోగి, సీపీఐ కలసి ఎన్నికలకు దిగుతుండడంపై స్పందించేందుకు ప్రతిమ నిరాకరించారు. ‘అది వాళ్ల రాజకీయం. వాళ్లకు ఏది సరైందనిపిస్తే అది చేస్తారు. దానిమీద ఏం మాట్లాడతాం.’అని అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు