Home /News /politics /

THE OPTIMISTS ARE LOOKING FORWARD TO BEING ASSIGNED THE ELC POSITION IN KHAMMAM KMM VB

MLC Elections: ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశావహుల ఎదురుచూపులు.. సీఎం వారిని పక్కన పెట్టనున్నారా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

MLC Elections: తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ.. జలగం వెంకటరావు, మాజీ ఎమ్మెల్యే.. బాలసాని లక్ష్మీనారాయణ, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ.. వద్దిరాజు రవిచంద్ర అలియాస్‌ గాయత్రి రవి, ప్రముఖ గ్రానైట్‌ వ్యాపారి.. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

ఇంకా చదవండి ...
  (G.SrinivasReddy,News18,Khammam)

  తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ.. జలగం వెంకటరావు, మాజీ ఎమ్మెల్యే.. బాలసాని లక్ష్మీనారాయణ, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ.. వద్దిరాజు రవిచంద్ర అలియాస్‌ గాయత్రి రవి, ప్రముఖ గ్రానైట్‌ వ్యాపారి.. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఆశించే వారి సంఖ్య ఇలా పెరుగుతుండగా.. అధినేత కేసీఆర్‌కు మాత్రం ఆశావహుల నుంచి ఒకరిని ఎంచుకోవడం సవాలుగా మారింది. వీరితో బాటుగా ఇంకా రెండో తరం, ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం తమకు అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్న పరిస్థితి. పలువురు సీఎంలతో మంత్రిగా కలసి పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌ మంత్రివర్గంలో ఆర్‌.బి మంత్రిగా పనిచేస్తూ 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

  Telangana Politics: తెలంగాణలో మరో సమరణానికి మొదలైన సందడి.. టీఆర్ఎస్ నుంచి వాళ్లకే టికెట్లు..?


  పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా 2014 ఎన్నికల్లో విజయం సాధించి, అనంతరం తెరాసలో చేరడం.. 2019 ఎన్నికల్లో సామాజికవర్గ సమీకరణలో భాగంగా టికెట్‌ దక్కక పోవడం తెలసిందే. ఇక మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడైన జలగం వెంకటరావు 2004లో సత్తుపల్లి నుంచి, 2014లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గతంలో తెదేపాలోనూ, ఇప్పుడు తెరాసలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధాన నేతగా ఉన్నారు. ఇంకా గాయత్రి రవిగా పాపులర్‌ అయిన వద్దిరాజు రవిచంద్ర గతంలో వరంగల్‌ నుంచి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఎమ్మెల్సీ టికెట్‌ సాధించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇలా ఎమ్మెల్సీ టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

  Google Home Remote: ఆండ్రాయిడ్ యూజర్లకు మరో యాప్ బేస్డ్ గూగుల్ టీవీ రిమోట్‌ ఆప్షన్.. వివరాలివే..


  మరి వీరందరిలో టికెట్‌ ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పదవీ కాలం జనవరి 4వ తేదీతో ముగియనుండగా, ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 16న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరణ మొదలై 23 దాకా కొనసాగనుంది. 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. డిసెంబరు 10వ తేదీన ఎన్నికలు, 14న కౌంటింగ్‌ జరగనున్నాయి. దీనికి గానూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 769 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని కార్పోరేటర్లు, మున్సిపల్‌ కౌన్సెలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

  Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..


  ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలానికి గానూ 2015లో ఎన్నికలు జరగ్గా అప్పట్లో టీఆర్‌ఎస్‌ తరపున బాలసాని లక్ష్మీనారాయణ, మహా కూటమి తరపున సీపీఐ సీనియర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, వైసీపీ నుంచి లింగాల కమల్‌రాజులు పోటీ చేయగా, బాలసాని లక్ష్మీనారాయణ విజయం సాధించారు. అప్పట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు సన్నిహితంగా ఉన్న బాలసానికి టికెట్‌ దక్కగా, ప్రస్తుతం ఈ టికెట్‌ ఎవరికి దక్కనుందో సస్పెన్స్‌గానే ఉంది. ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సైతం బాలసాని సన్నిహితుడు కావడం ఆయనకు కలసి వచ్చే అంశం.

  అయితే జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర ప్రజా ప్రతినిధుల అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్‌ తీసుకుంటారా లేక పార్టీ కోణంలో తనదైన శైలిలో టికెట్‌ కేటాయిస్తారా అన్నది వేచిచూడాల్సిన అంశం. ఇలా ఆశావహులంతా ఆశగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురు చూస్తుండగా, వీరిలో సీనియర్లు మాత్రం నిగూఢంగా తమ ప్రయత్నాల్లో ఉండగా, ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం ఒక్క ఛాన్స్‌ అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. గెలుపునకు అవసరమైన పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న తెరాసలో టికెట్‌ ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
  Published by:Veera Babu
  First published:

  Tags: Telangana, Telangana mlc election, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు