Home /News /politics /

THE NUMBER OF WOMEN MLAS IN THE FIVE STATE ASSEMBLY ELECTIONS HAS INCREASED MORE THAN EVER BEFORE SNR

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఆడవాళ్ల ప్రభంజనం ..మరింత పెరిగిన ఎమ్మెల్యేల సంఖ్య

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Women Political Power: మహిళా ఎమ్మెల్యేల సంఖ్య గతంలో కంటే ఈసారి పెరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలైన వారి వివరాలు చూస్తే ప్రతి రాష్ట్రంలో కొత్తగా చట్టసభల్లో అడుగుపెట్టే వాళ్లు పెరిగారు.

ఆడవాళ్లు మీకు జోహార్లు అన్నట్లుగా మారిపోతున్నాయి రాజకీయాలు. ఈమధ్యనే జరిగిన ఐదు రాష్ట్రాల (Five States)అసెంబ్లీ ఎన్నికల్లో(Elections) మహిళల(womens) హవా కొనసాగింది. ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్టసభల్లోకి అడుగుపెట్టబోతున్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఉత్తరప్రదేశ్(Uttar pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), పంజాబ్(Punjab), గోవా(Goa), మణిపూర్(Manipur)రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత విజేతలైన వారి వివరాలు చూసుకుంటే రాష్ట్రాల వారిగా కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఈసారి కొత్తగా 46మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 42మంది శాసనసభకు ఎన్నికవగా..ఈసారి ఆ సంఖ్య మరో నాలుగు పెరిగింది. ఇందులో బీజేపీకి చెందిన వాళ్లు 30మంది మహిళా నేతలు ఎమ్మెల్యేలు అయితే అప్నాదళ్ నుంచి ముగ్గురు, సమాజ్‌వాది పార్టీ నుంచి 12మంది, కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు చట్టసభలకు ఎన్నికయ్యారు. మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు అగ్రతాంబులం అందుకున్నారు. ఇక్కడ 60అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఐదుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలు ప్రాతినిద్యం వహించినట్లుగా మణిపూర్‌ చరిత్ర సృష్టించింది. రాష్ట్రమణిపూర్‌

మహిళలదే రాజ్యం..
ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన పంజాబ్‌లోనూ మహిళామణులు తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. ఇక్కడ 117 నియోజకవర్గాల్లో పోటీ జరిగితే 13 మంది మహిళా నేతల్ని ఎమ్మెల్యేలుగా చేసి అసెంబ్లీలో అడుగుపెట్టే అధికారం ఇచ్చారు ఓటర్లు. గత ఎన్నికల్లో కేవలం ఆరుగురు మహిళలు మాత్రమే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఈసారి సంఖ్య రెట్టింపు అయింది.

తగ్గేదేలే అంటున్న లేడీ లీడర్స్ ..
ఉత్తరాఖండ్‌లో కూడా మహిళలు తమ పొలిటికల్ పవర్‌ని ప్రూవ్ చేసుకున్నారు. రాష్ట్రంలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో ఆరుగురు మహిళా అభ్యర్థులకు బీజేపీ ఎన్నికల బరిలోకి దింపితే అందరూ గెలిచి చట్టసభలకు ఎన్నికయ్యారు. అటు అతి చిన్న రాష్ట్రమైన గోవాలో కూడా మహిళలు తగ్గేదేలే అనిపించుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు మహిళామణులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈసారి ఆ సంఖ్య మూడుకు చేరుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనే మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగింది. ఇకపై జరగబోయే లోక్‌సభ, సార్వత్రిక ఎన్నికల్లో  ఆ సంఖ్య మరింత  పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Published by:Siva Nanduri
First published:

Tags: Assembly Election 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు