• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • THE MEETING OF THE FORMER BJP CHIEF MINISTER AND SHIV SENA MP HAS BECOME A SENSATION IN MAHARASHTRA POLITICS NS

Maharashtra Politics: మాజీ సీఎం ఫడ్నవీస్ తో శివసేన ఎంపీ భేటీ.. అందుకేనా?

Maharashtra Politics: మాజీ సీఎం ఫడ్నవీస్ తో శివసేన ఎంపీ భేటీ.. అందుకేనా?

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

Maharashtra Politics: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇరు పార్టీల నడుమ మళ్లీ స్నేహం చిగురిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Share this:
    మహారాష్ట్రలో ఉప్పు నిప్పులా ఉంటున్న అధికార శివసేన, ప్రతిపక్ష బీజేపీల ముఖ్య నేతల సమావేశం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. శనివారం శివసేన ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ కీలక నేత, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ లో దాదాపు రెండు గంటల పాటు వీరి భేటీ సాగింది. బీజేపీపై సంజయ్ రౌత్ ఇటీవల అనేక అంశాలపై విమర్శలు చేశారు. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయబిల్లులను కూడా సంజయ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ సైతం మహారాష్ట్రలో కరోనా వ్యాప్తిపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ తరుణంలో ఇరు పార్టీల నేతలు భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైంది. ఇరు పార్టీల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందా అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగాయి.

    అయితే ఈ అంశంపై సంజయ్ రౌత్ ఆదివారం స్పందించారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఇంటర్వ్యూ కోసమే ఫడ్నవీస్ ను కలిసినట్లు చెప్పారు. తమ మధ్య సిద్ధాంత పరమైన విభేదాలే తప్పా వ్యక్తిగత శత్రుత్వమేదీ లేదని స్పష్టం చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మాట్లాడుకోవడం సహజమేనన్నారు. తాము గతంలో బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న సమయంలో శరద్ పవార్ ను సైతం కలిశామని చెప్పారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ, సోనియాను కలిసి ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఫడ్నవీస్ బీజేపీ బీహార్ ఎన్నికల ఇంచార్జిగా పనిచేస్తున్నారు. బీహార్ ఎన్నికల అనంతరం తాను ఇంటర్వ్యూ ఇస్తానని సంజయ్ రౌత్ కు ఆయన చెప్పినట్లు సమాచారం.

    ఏది ఏమైనా మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్ష నేతల సమావేశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో వ్యక్తిగత శతృత్వం ఉండదని చెప్పడానికి నిదర్శనమని కొందరు వాఖ్యానిస్తున్నారు. మరి కొందరు మాత్రం బీజేపీ, శివసేన దగ్గర అవుతున్నాయని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా భావించవచ్చని అంటున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు