Home /News /politics /

THE LEADERS WHO HELD PUBLIC RALLY IN AZAM ZAHI MILL BECAME PM NOW CM KCR FOLLOWS SAME SENTIMENT SK

అజంజాహీ మిల్లులో సభ జరిగితే ప్రధాని పదవి పక్కా..మరి కేసీఆర్ కూడా..

కేసీఆర్ (ఫైల్ ఫొటో)

కేసీఆర్ (ఫైల్ ఫొటో)

ప్రధాని పీఠంపై కోరికలేదని కేసీఆర్ పైకి చెబుతున్నా... ఆ పదవి టార్గెట్‌గానే గత సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

    జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టిసారించారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశంలో గుణాత్మక మార్పురావాలన్న నినాదంతో ఆయన దూసుకెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర కూటమి అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని ప్రతి సభలోనూ చెబుతున్నారు. తెలంగాణలో 16 సీట్లు గెలిచి దేశరాజకీయాల్లో పొలికేక పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ సభలో ఆసక్తికర విషయాన్ని చెప్పారు కేసీఆర్. అజంజాహీ మిల్లులో సభపెట్టిన నేతలంతా ప్రధాని అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. అదే ప్రాంగణంలో టీఆర్ఎస్ సభ జరగడం విశేషం. ఐతే తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని..కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

    ప్రధాన మంత్రి ఎవ్వరైనా కానీయండి. వరంగల్ అజంజాహీ మిల్లులో సభపెట్టిన నేతలంతా ప్రధాని అవుతారని ఎంపీ పసునూరి దయాకర్ చెప్పారు. కానీ ప్రధాన మంత్రి కావాలనే కోరిక నాకు లేదు. గెలవాల్సింది..పార్టీలు, వ్యక్తులు కాదు..! ప్రజల అభిమతం గెలవాలి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుంది.
    కేసీఆర్, తెలంగాణ సీఎం


    వాస్తవానికి అజంజాహీ మిల్లులో రాజకీయ సభలు పెట్టడానికి పార్టీలు పెద్ద ఆసక్తి చూపించవు. కానీ ఆ గ్రౌండ్‌లో వరంగల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారసభను నిర్వహించింది గులాబీ దళం. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు మద్దతుగా జరిగిన ఆ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. దీని వెనక పెద్ద సెంటిమెంటే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో మాజీ ప్రధాని జవహర్‌నెహ్రూ అజంజాహీ మిల్లులోనే బహిరంగ సభ పెట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి నెహ్రూ ప్రధాని అయ్యారు.

    పీవీ నరసింహారావు విషయంలోనూ ఇదే జరిగింది. గతంలో అదే గ్రౌండ్‌లో పీవీ నరసింహారావు బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన్ను ప్రధాని పదవి వరించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ని కేసీఆర్ ఫాలో అయినట్లు తెలుస్తోంది. తనకు ప్రధాని పీఠంపై కోరికలేదని కేసీఆర్ పైకి చెబుతున్నా... ఆ పదవి టార్గెట్‌గానే గత సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరి నిజంగా ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..? కేసీఆర్ ప్రధాన మంత్రి అవుతారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Kcr, Lok Sabha Election 2019, Telangana, Telangana Lok Sabha Elections 2019, Telangana News, Telangana Politics, Warangal S29p15

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు