ట్రంప్ కామెంట్స్‌తో యావత్ దేశం షాక్‌కి గురైందన్న కాంగ్రెస్.. తప్పు పట్టిన వెంకయ్య..

కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. ట్రంప్ వ్యాఖ్యలతో యావత్ దేశం షాక్‌కు గురైందని అన్నారు. G20 సదస్సు వేదికగా కశ్మీర్ సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని మోదీ తనను కోరినట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో చెప్పడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

news18-telugu
Updated: July 23, 2019, 3:16 PM IST
ట్రంప్ కామెంట్స్‌తో యావత్ దేశం షాక్‌కి గురైందన్న కాంగ్రెస్.. తప్పు పట్టిన వెంకయ్య..
వెంకయ్య నాయుడు (File)
  • Share this:
భారత్-పాక్ మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యలో మధ్యవర్తిగా జోక్యం చేసుకోవాలని భారత్ తనను కోరినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభ దద్దరిల్లింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్పందించిన కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్.. కశ్మీర్ సమస్యను భారత్ ద్వైపాక్షిక సమస్యగానే చూస్తోందని పునరుద్ఘాటించారు.పాకిస్తాన్‌తో ఉన్న సమస్యలేవైనా ద్వైపాక్షికంగానే చర్చిస్తామని చెప్పారు.షిమ్లా ఒప్పందం&లాహోర్ ఒప్పందాల ప్రాతిపదికగా భారత్-పాక్ సమస్యలను ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.

కేంద్రమంత్రి జైశంకర్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని వివక్షాలు.. ప్రధాని మోదీ సభకు వచ్చి దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దాంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు విపక్షాల తీరును తప్పు పట్టారు. 'ఇది జాతీయ సమస్య. ఈ విషయంలో మనమంతా ఐక్యంగా ఉండి ఒకే గొంతుక వినిపించాలి' అని అన్నారు. అంతేకాదు, విపక్షాలకు మన కేంద్రమంత్రి కంటే అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల పైనే ఎక్కువ నమ్మకం ఉందని చురుకలంటించారు.ఇలాంటి చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని అన్నారు.

అధికార-విపక్ష సభ్యుల గందరగోళం నడుమే సభ 12గంటలకు వాయిదా పడింది.తిరిగి ప్రారంభమయ్యాక మళ్లీ 2గంటలకు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభం కాగానే విపక్షాలు 'ప్రధానమంత్రి సమాధానం చెప్పు'అని నినదించాయి. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. ట్రంప్ వ్యాఖ్యలతో యావత్ దేశం షాక్‌కు గురైందని అన్నారు. G20 సదస్సు వేదికగా కశ్మీర్ సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని మోదీ తనను కోరినట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో చెప్పడం

ఆందోళనకు గురిచేస్తోందన్నారు.కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందన్నది విషయం కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కశ్మీర్ విషయంలో మన విదేశాంగ విధానం ద్వైపాక్షికంగానే ఉండాలి. మూడో వ్యక్తి జోక్యానికి అందులో తావు లేదు. ఇది ట్రంప్‌కు కూడా తెలుసు. కాబట్టి పాక్ ప్రధానితో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవడం లేదు.
గులాంనబీ ఆజాద్,కాంగ్రెస్ ఎంపీ
First published: July 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>