లోక్‌సభ ఎన్నికలకు ఈసీ సిద్ధం... ఇవాళ సాయంత్రమే నోటిఫికేషన్

సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ సిద్ధమవుతుంది.

news18-telugu
Updated: March 10, 2019, 12:22 PM IST
లోక్‌సభ ఎన్నికలకు ఈసీ సిద్ధం... ఇవాళ సాయంత్రమే నోటిఫికేషన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది. ఇవాళ సాయంత్రమే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ సిద్ధమవుతుంది. మరోవైపు ఇప్పటికే నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో ప్రతిపక్షాలు ఈసీని ప్రశ్నిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనలు పూర్తవ్వడం కోసం ఈసీ ఇంకా వెయిట్ చేస్తుందా ? అంటూ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇప్పటికే ప్రశ్నించారు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు... ప్రధాని మోదీ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. అనేక రాష్ట్రాల్లో పర్యటించి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు... ప్రజలపై వరాల జల్లు కురిపించారు. దాదాను రూ. 50వేల కోట్ల కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో మోదీ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల నేపథ్యంలో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్‌ 3వ తేదీతో ముగియనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే వారం ఎన్నికల పరిశీలకులు సమావేశం కానున్నారు. ఏప్రిల్‌- మే నెలల మధ్య 7-8 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మార్చి నెలాఖరులో తొలి దశ ప్రకటన వెలువడనుండగా, ఇందుకు సంబంధించిన ఎన్నికలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి లోక్‌సభ ఎన్నికలతో పాటు పదవీకాలం పూర్తి కానున్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికలను కూడా ఈసీ నిర్వహించనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించేశాయి.

ఇవికూడా చదవండి:రాజకీయాలపై టార్చ్ లైట్ ... కమల్ హాసన్ పార్టీకి గుర్తు కేటాయింపు

భర్త కోసం బిడ్డను కుదువ పెట్టిన భార్య..
First published: March 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>