ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. ముఖ్య అతిథిగా జగన్

Kaleshwaram Project: ఈ నెల 21న ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిశ్చయించారు. త్వరలోనే విజయవాడకు స్వయంగా తానే వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 1:44 PM IST
ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. ముఖ్య అతిథిగా జగన్
ప్రతీకాత్మక చిత్రం(Image: Facebook)
  • Share this:
తెలంగాణను సస్యశ్యామలం చేయనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 21న ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిశ్చయించారు. త్వరలోనే విజయవాడకు స్వయంగా తానే వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు. కాగా, ఈ నెల 14న ఢిల్లీలో నిర్వహించనున్న నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లనున్న సీఎం.. అక్కడ ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించే అవకాశం కూడా ఉంది. ఈ మధ్యే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన కేసీఆర్.. పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పటికే దాదాపు పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ లోగా డ్రైరన్‌ను కూడా చేపట్టనున్నారు. ప్రస్తుతం నీటి కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నా.. గడువులోగా అన్ని పనులను చక్కబెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
First published: June 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading