Home /News /politics /

THE CONGRESS WORKING COMMITTEE WILL MEET ON THE 16TH OF THIS MONTH AND THE MEETING MAY FOCUS ON PARTY ELECTIONS AND THE ELECTION OF A NEW PRESIDENT PRV

Congress party: ఎట్టకేలకు కదిలిన కాంగ్రెస్​ అధిష్టానం.. పార్టీలో పరిస్థితులపై ఈనెల 16న సీడబ్ల్యూసీ సమావేశం?

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ (ఫైల్ ఫోటో)

పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్​ గాంధీ (Rahul Gandhi) రాజీనామా చేశాక.. చాలామంది కార్యకర్తల్లో పార్టీ భవిష్యత్తుపై (party future) ఆందోళనలు నెలకున్నాయి. మరోవైపు సీనియర్లు అధ్యక్ష పదవి కోసం పోటీలో లేమంటూనే అధిష్టానానికి కొంత పొగపెడుతున్నారు. ఈ రకంగా పార్టీలో అంతర్గత కలహాలు శృతిమించిన వేళ ఈనెల 16వ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం (meeting) జరుగనుంది.

ఇంకా చదవండి ...
    కాంగ్రెస్​ పార్టీ (congress party). ఏళ్లుగా కేంద్రంలో చక్రం తిప్పిన పార్టీ. గత పదేళ్లుగా ప్రతిపక్ష స్థానానికే (opposition) పరిమితమై చాలా ప్రాంతాల్లో డిపాజిట్లు (deposits) కాపాడుకునే పరిస్థితులో ఉంది. ఇక అంతర్గత కలహాలూ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్​ గాంధీ (Rahul Gandhi) రాజీనామా చేశాక.. చాలామంది కార్యకర్తల్లో పార్టీ భవిష్యత్తుపై (party future) ఆందోళనలు నెలకున్నాయి. మరోవైపు సీనియర్లు అధ్యక్ష పదవి కోసం పోటీలో లేమంటూనే అధిష్టానానికి కొంత పొగపెడుతున్నారు. ఈ రకంగా పార్టీలో అంతర్గత కలహాలు శృతిమించిన వేళ ఈనెల 16వ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం (meeting) జరుగనుంది. పార్టీ సంస్థాగత ఎన్నికల (party elections)తో పాటు కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఈ సమావేశం (meeting)లో కీలకంగా చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

    జీ 23 నేతల ఒత్తిడి..

    పంజాబ్‌ (Punjab), చత్తీస్‌ఘడ్‌ (Chhattisgarh)  రాష్ట్రాల్లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరడంతో  కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (Congress working committee) సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జీ-23 నేతలు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి అయిన సీడబ్ల్యూసీ ఈ నెల 16న భేటీ కానుంది.

    వచ్చే ఏడాదిలో ఎన్నికలు..

    పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు (political situations), వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగనుంది. 16వ తేదీ ఉదయం దేశ రాజధాని ఢిల్లీ (delhi)లో అక్బర్‌ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ భేటీ ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు. గత కొద్దిరోజులుగా నాయకత్వలేమితో సతమతమవుతున్న కాంగ్రెస్​ పార్టీకి ఈ సమావేశం ప్రాధాన్యత తీసుకొచ్చింది.



    పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్‌ పరిణామాలపై ఇటీవల జీ-23 అసమ్మతి నేతలు ఘాటుగా విమర్శలు గుప్పించారు. సీడబ్ల్యూసీ భేటీ గురించి పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుతం సోనియా గాంధీ (Sonia Gandhi) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఎప్పటి నుంచో పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలను రాహుల్‌ (Rahul)కు అప్పగించాలని కొందరు కోరుతున్నారు. దీంతో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పంజాబ్‌, యూపీ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని ఈ సందర్భంగా ఖరారు చేయనున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Congress, CWC, Delhi, Rahul Gandhi, Review meeting, Sonia Gandhi

    తదుపరి వార్తలు