THE CONGRESS HAS CONDEMNED BJP MP PRAGYA SINGH FOR SAYING THAT ALCOHOL IS LIKE A MEDICINE FOR HEALTH SNR
మద్యం తాగితే ఆరోగ్యానికి మంచిదేనన్న బీజేపీ ఎంపీ ..ఏకి పారేస్తున్న కాంగ్రెస్ నేతలు
Photo Credit:Twitter
Video viral: మద్యం తాగొచ్చు ఏం తప్పులేదన్నారు బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్. అయితే మితంగా తాగితే శరీరానికి ఔషదంలా పనిచేస్తుందన్నారామె. ఇది తెలియక చాలా మంది అధికంగా మద్యం తాగి ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారని చేసిన కామెంట్స్‌కి కాంగ్రెస్ ధీటుగా కౌంటర్ ఇచ్చింది.
మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది. ఆల్కహాల్ శరీరానికి ఓ మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు మధ్యప్రదేశ్ (Madhya pradesh)భోపాల్ (Bhopal)ఎంపీ (Bjp Mp)ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ (Pragya Singh). అధికార పార్టీ ఎంపీ అయి ఉండి ఆమె ఆ విధంగా మాట్లాడటంతో పెద్ద దుమారం చెలరేగుతోంది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ congressతీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మధ్యప్రదేశ్‌లో మద్యం నిషేధించాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇక సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్(Shivraj singh chouhan)కొత్త ఎక్సైజ్ పాలసీ (New excise policy)ని తీసుకొచ్చారు. దీనిపైన కూడా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుంది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మద్యం తాగడం మంచిదే మితంగా తీసుకుంటే ఓ ఔషదంగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో ఉందంటూ కొత్త భాష్యం చెప్పారు. ఇది అర్ధం చేసుకోకుండా అధికంగా మద్యం సేవిచండం వల్లే చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఎంతో మంది మహిళలు తమ భర్తలు తాగుడికి బానిసలవడం వల్ల మహిళలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని చెప్పారు. మద్యం నిషేధిస్తే మంచిదేనంటూ మొదట తన చేసిన వ్యాఖ్యలను కవర్ చేసుకునే విధంగా మాట్లాడారు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్. అంతే కాదు ఈనెల 20న బీజేపీ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister of Madhya Pradesh)ఉమాభారతి (Uma bharati).చేసిన డిమాండ్‌కి తాను మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు.
మద్యం తాగితే ఆరోగ్యానికి మంచిదేనట..
మధ్యప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎంపీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పీసీసీ నేత నరేంద్ర సలుజా ట్వీట్టర్ వేదికగా ఆమెకు చురకలంటించారు. భోపాల్ ఎంపీకి మద్యం తాగడం తప్పుగా అనిపించడం లేదట. ప్రతి ఒక్కరు మితంగా తాగండి అంటూ మెసేజ్ ఇచ్చినట్లుగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం తెచ్చిన నూతన ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేది నుంచి అమల్లోకి రానుంది. ఆ పాలసీ ప్రకారం మద్యం ధరలు ఇంకా తగ్గవచ్చు. అయితే మద్యం ధరలు తగ్గినా, పెరిగినా అధికంగా తాగడం వల్లే ప్రమాదం అని ఈ విషయాన్ని అందరూ గమనించాలని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తెలిపారు.
भोपाल की भाजपा सांसद साध्वी प्रज्ञा ठाकुर अब बता रही है कि “शराब औषधि का काम करती है ,असीमित मात्रा में लेने से वो नुक़सान का काम करती है“
सांसद जी के मुताबिक़ सीमित मात्रा में वो नुक़सान देह नही है , सबको समझना चाहिये।
బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ నేత కౌంటర్..
మద్యం తాగడం మంచిదేనని బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలను అడ్డుపెట్టుకొని బీజేపీని ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.