Home /News /politics /

THE CENTRAL ELECTION COMMISSION HAS ISSUED A NEW DIRECTIVE EXTENDING PERMISSION FOR RALLIES AND ASSEMBLIES IN FIVE STATES ELECTIONS SNR

పార్టీలు, అభ్యర్దుల దూకుడుకు ఈసీ కళ్లెం..ఎన్నికల ప్రచారంపై కొత్త ఆంక్షలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

CEC ON ELECTIONS: ఐదు రాష్ట్రాల్లో నిర్వహించబోయే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్దులకు కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్త సూచనలు చేసింది. భారీ ర్యాలీలు, బహిరంగసభలపై నిషేధాన్ని పొడిగించిన ఈసీ ఇంటింటి ప్రచారానికి అనుమతినిచ్చింది. ఎన్నికల విధుల్లో రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల నిర్వాహణ అధికారులకు సూచించింది.

ఇంకా చదవండి ...
ఫిబ్రవరి నుంచి మొదలయ్యే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీలు, పోటీ చేసే అభ్యర్ధులు అనుసరించాల్సిన విధివిధానాలను కేంద్ర ఎన్నికల సంఘం(Central election commission) ప్రకటించింది. దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ (Third wave) ప్రభావం అధికంగా ఉన్నందున ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించే బహిరంగ ర్యాలీలు, భారీ రోడ్‌ షో(Road shows)లపై ఉన్న నిషేధాన్ని ఈనెలాఖరు వరకూ పొడిగించింది. కేసులు పెరుగుతున్న దృష్ట్య రాజకీయ పార్టీలకు భౌతిక ర్యాలీలు(Rallys) , బహిరంగ సభలకు సడలింపు ఇస్తూనే ఆంక్షలు విధించింది. తొలి విడత (Phase-1)జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులకు మాత్రమే జనవరి 28నుంచి ప్రచారానికి అనుమతి ఇచ్చింది ఈసీ. ఫేజ్ 1 కోసం పోటీ చేసే అభ్యర్థులు జనవరి 28, నుంచి రెండో దశలో పోటీలో నిలిచిన అభ్యర్దులు ఫిబ్రవరి 1వతేది నుంచి కేవలం ఇంటింటి ప్రచారానికి మాత్రమే అనుమతించింది. ఈ ఇంటింటి ప్రచారానికి ఐదుగురు నుంచి పది మందికి పరిమితి పెంచింది. పోటీ చేస్తున్న అభ్యర్దులు బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం చేసుకునేందుకు వీడియో వ్యాన్‌లను అనుమతి ఇచ్చిన ఈసీ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

ఎన్నికల నియమావళి..
మొదటి దశలో జరిగే పోలింగ్‌ కోసం ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులతో పాటు సమావేశంలో రాష్ట్రాల అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఏ రాజకీయ పార్టీ, అభ్యర్దులు రోడ్‌షోలు, పాదయాత్రలు, సైకిల్‌,బైక్‌ , వాహన ర్యాలీలతో పాటు ఊరేగింపులకు అనుమతి లేదని పేర్కొంది. జనవరి 31వ తేది వరకూ ఇంటింటి ప్రచారానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. సెకండ్‌ ఫేజ్‌లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల వివరాలు ఈనెల 27లోగా ఖరారు చేస్తే వారిని అనుమతించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

అందరూ పాటించాల్సిందే..
భారత ఎన్నికల సంఘం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శులతో వర్చువల్‌ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎన్నికలు జరుగుతున్న గోవా, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాంఖండ్ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌లతో పాటు సీఎస్‌లు, ఎన్నికల ముఖ్య అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించింది. ఎన్నికలు నిర్వహించబోయే రాష్ట్రాల్లో కోవిడ్‌ వ్యాక్సినేష్ ప్రక్రియపై సీఈసీ ఆరా తీసింది. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను త్వరగా పూర్తి చేసే విధంగా తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయా రాష్ట్రాల అధికారులకు సూచించింది. రెండు డోస్‌ల టీకాలు పూర్తైన వారికే ఎన్నికల విధుల్లో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Assembly Election 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు