Home /News /politics /

THE BJP WON THE HIGHEST NUMBER OF SEATS IN THE LOCAL BODY ELECTIONS IN TRIPURA PRV

Tripura: త్రిపుర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా.. మొట్టమొదటి సారి అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాషాయ పార్టీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

త్రిపుర (Tripura)లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local body elections) బీజేపీ విజయఢంకా మోగించింది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ (BJP).. అక్కడ స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగింది.

ఇంకా చదవండి ...
    త్రిపుర (Tripura)లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local body elections) బీజేపీ విజయఢంకా మోగించింది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ (BJP).. అక్కడ స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ బీజేపీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంది. అయితే, ఈ ఎన్నికలతో రాష్ట్రంలో తమ ఉనికి చాటుకుంటామని భావించిన మమతా బెనర్జీ నేతృత్వంలోని  TMC ఆశలకు ఈ ఎన్నికల ఫలితాలు గండి కొట్టాయి. 14 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతోంది. త్రిపురలో మొత్తం 20 మునిసిపాలిటీలకు (Municipality) గానూ 14 స్థానాల్లో గురువారం ఓటింగ్ జరిగింది. బీజేపీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తం 334 వార్డులకు గానూ బీజేపీ ఇప్పటికే 112 స్థానాల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 222 స్థానాలకు ఓటింగ్ జరిగింది.

    2018లో అధికారం..

    రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం అంబాసా, జిరానియా, తెలియమురా, సబ్రూమ్‌లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ త్రిపురలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అగర్తల మున్సిపల్ కార్పొరేషన్ (AMC)లోని అన్ని వార్డులలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) రెండవ స్థానాన్ని పొందినట్లు ట్రెండ్‌లు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఎంసీ ఏరియాల్లో బీజేపీకి 58,821 ఓట్లు రాగా, టీఎంసీకి 22,295 ఓట్లు వచ్చాయి. సీపీఐ(ఎం) 15,960 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. సీపీఐ(ఎం)తో పొత్తు పెట్టుకున్న మరో మూడు వామపక్ష పార్టీలు సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ మొత్తం 2,650 ఓట్లను సాధించాయి. అయితే సీపీఎం మాత్రం బీజేపీ కంటే వెనుకంజలో ఉంది.

    ఆరు మునిసిపల్ స్థానాల్లో..

    తృణమూల్ కాంగ్రెస్​ అగర్తల మినహా, రెండు పట్టణ సంస్థలలో 2వ స్థానంలో నిలిచింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ మూడు పట్టణ సంస్థలలో 3వ స్థానంలో ఉంది. త్రిపుర ఎన్నికలలోని ఆరు మునిసిపల్ స్థానాల్లో TMC మూడవ స్థానంలో ఉంది. ఈ 222 స్థానాల్లో దాదాపు 785 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే.. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని, తుది ఫలితం ప్రకటించడానికి కొంత సమయం పడుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, త్రిపుర పోలీసులు, త్రిపుర స్టేట్ రైఫిల్స్ (టీఎస్‌ఆర్) సిబ్బందిని మోహరించడంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

    ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. గురువారం ఓటింగ్‌తో, టీఎంసీ, సీపీఐ(ఎం) ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపించాయి. రెండూ వివిధ మున్సిపాలిటీలలో రీ పోలింగ్ చేయాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో అధికార బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Elections, Tripura

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు