• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • THE BJP IS MAKING A COSMIC EFFORT TO TAKE OVER THE SIDDIPET MUNICIPALITY IN SIDDIPETA DISTRICT VB MDK

Muncipal Elections: దుబ్బాక సీన్ రిపీట్ కానుందా.. గులాబీ తోటలో కమలం వికసించనుందా.. మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యూహ రచనలేంటి..

Muncipal Elections: దుబ్బాక సీన్ రిపీట్ కానుందా.. గులాబీ తోటలో కమలం వికసించనుందా.. మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యూహ రచనలేంటి..

సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయం

Muncipal Elections: సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయా ? గత 5 సంవత్సరాల క్రితం అధికార పార్టీ మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులను కైవసం చేసుకొని రాజనర్సు మున్సిపల్ చైర్మన్ గా చేసిన మంత్రి హరీష్ రావు.. ఈ సారి టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చైర్మన్ కైవసం చేసుకోవడానికి తమ వ్యూహాలకు పదును పెట్టారు.

  • Share this:
    సిద్దిపేట అంటేనే హరీశ్ రావు.. హరీశ్ రావు అంటేనే సిద్దిపేట అనే అంతగా పాపులారిటీ తెచ్చుకున్నారు మంత్రి హరీశ్ రావు.  తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ఎవరికీ రానంత భారీ మెజారిటీ తెచ్చుకొని తనకు సిద్దిపేటలో తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నారు. అక్కడ చిన్న పిల్లాడిని అడిగినా హరీశ్ అన్నకే మా మద్దతు అంటారు. సిద్దిపేట కంచుకోటలో గులాబీ జెండా కు ఎదురుతిరిగే జెండాలు ఉండవు.. ప్రతిపక్ష పార్టీల నుండి పోలింగ్ బూత్ లో ఏజెంట్లు విధులు నిర్వహిస్తున్నా వారు కూడా నామ్ కే వాస్తే ఏజెంట్ గా ఉండేవారు. అలాంటి సిద్దిపేట మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలో కాషాయం జెండా ఎగురుతుందా.. అంటే చెప్పలేని పరిస్థితి. కానీ పక్కనే ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీని కాదని ప్రజలు బీజేపీ వైపు నిలిచారు. రఘునందన్ రావు అతి తక్కువ మెజారిటీతో గెలిచినా మంత్రి హరీశ్ రావు దగ్గరుండి టీఆర్ఎస్ ను నడిపించినా బీజేపీ జెండా ఎగరడంతో పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఇదే జోరును జీహెచ్ఎంసీ ఎన్నికలో కూడా చూపించారు. ప్రజలు తమను ఆదరిస్తున్నారని.. అధికార పార్టీపై ఉన్న వ్యతికరేకత తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

    అదే జోరును సిద్దిపేటలో కూడా కొనసాగించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. కాషాయం కార్యకర్తలకు అండగా ఉంటూ అధికార పార్టీని దెబ్బ తీయాలనే ఆలోచనలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నట్లు తెలుస్తొంది. దుబ్బాక బై ఎలక్షన్లలో కాషాయం జెండా ఎగురవేయడంతో సిద్దిపేట జిల్లాలో కాషాయం జెండా ఎగురవేయాలని యువత ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఎలాగైనా సరే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో కాషాయం జెండా ఎగరవేయడానికి రఘునందన్ రావు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన టీఆర్ఎస్ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థులను బీజేపీ ఇప్పటికే జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. సిద్దిపేట్ మున్సిపాలిటీలో బీజేపీ చైర్మన్ కైవసం చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో బిజెపికి మంచి భవిష్యత్ ఉంటుందని.. వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    గులాబీ జెండాకు కాషాయం జెండాకు మధ్య పోరు పోటాపోటీగా ఉంటుందని సిద్దిపేట ప్రజలు అనుకుంటున్నట్లు విశ్వనీయ సమాచారం. సిద్దిపేట మున్సిపల్ లో మొత్తం 43 వార్డులు ఉండగా.. అధికార పార్టీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైన గులాబీకి, కమలానికి మధ్య ఏప్రిల్ 30న జరిగే సమరంలో సిద్దిపేట మున్సిపాలిటీ కోటపై ఏ పువ్వు వికసిస్తుందో చూడాలి.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు