Vizag Steel Plnat: చిరంజీవికి ఉక్కు కార్మికుల పాలాభిషేకం! తప్పుపడుతున్న కొన్ని కార్మిక సంఘాలు

చిరంజీవికి పాలాభిషేకం

నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ కు.. నేడు మెగాస్టార్ చిరంజీవికి పాలాభిషేకం చేశారు కార్మికలు. తమ ఉద్యమాన్నికి మద్దతు తెలిపిన వారందర్నీ గౌరవించుకోవడం తమ విధి అంటున్నారు. అయితే వారంతా నేరుగా వచ్చి ఉద్యమంలో పాల్గొంటే ఆ తీవ్రత వేరేగా ఉంటుందని కోరుతున్నారు.

 • Share this:
  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అలుపెరుగని పోరాటం చేస్తున్న కార్మిక సంఘాలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ మంత్రులు, కేటీఆర్, హరీష్ రావు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపగా.. తరువాత టాలీవడ్  ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కేంద్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టారు.

  తాను విద్యార్థిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి తన మద్దతు ప్రకటిస్తున్నాను అంటూ బావోద్వేగ పూరిత సందేశం పోస్ట్ చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి అన్నారు. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఘటన ఇంకా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది అన్నారు. ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నామన్నారు. అది ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించామన్నారు. విశాఖ ఉక్కుకు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం అన్నారు.

  విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్‌ గనులు కేటాయించకపోవడం, నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదని మెగాస్టార్ అన్నారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాను అన్నారు. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాల గుర్తించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి అన్నారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే ఇప్పుడు మనముందున్న ప్రధాన కర్తవ్యమని పిలుపు ఇఛ్చారు. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన హక్కు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం అని చిరంజీవి పిలుపునిచ్చారు.

  ఇదీ చదవండి: తమ్ముడి కోసమే మెగాస్టార్ గళమెత్తారా? స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి చిరంజీవి జైకొట్టడానికి అదే కారణమా?

  తమ ఆవేదనను చిరంజీవి అర్థం చేసుకున్నారంటూ కొందరు కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్మికుల్లో ఉన్న మెగా అభిమానులు నేరుగా చిరంజీవికి పాలభిషేఖం చేశారు.  కూర్మన్నపాలేం జంక్షన్ దగ్గర చిరంజీవి ఫోటోకు పాలాభిషేకం చేశారు కొందరు కార్మికులు.  స్టీలుఫ్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా మద్దత్తు తెలిపినందుకు ఆయనకు అభిషేకం చేస్తున్నామన్నారు కార్మికులు.. నిన్న మంత్రి కేటీఆర్ కు సైతం పాలాభిషేకం చేశారు..

  ఇదీ చదవండి: విశాఖలో కేటీఆర్ కు పాలాభిషేకం? తెలంగాణ మంత్రికి జై కొడుతున్న ఆంధ్రా జనం

  అయితే చిరంజీవికి పాలాభిషేకం చేయడాన్ని మాత్రం కొన్ని కార్మిక సంఘాలు తప్పు పడుతున్నాయి. చిరంజీవి లాంటి వ్యక్తి కేవలం ఒక్క ట్వీట్  చేసి ఊరుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి. ఆయన కచ్చితంగా ముందుకు వచ్చి నేరుగా ఉద్యమంలో పాల్గొనాలని.. అప్పుడు ఆయనకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటామంటున్నాయి కొన్ని కార్మిక సంఘాలు. ఎందుకంటే చిరంజీవి నేరుగా పాల్గొంటే కచ్చితంగా ఉద్యమానికి జాతీయ స్థాయి  గుర్తింపు వస్తుందని.. మీడియా ఫోకస్ మొత్తం ఉద్యమం మీదే ఉంటుందని. టాలీవుడ్ కూడా ఏకమై ముందుకు వచ్చే అవకాశం  ఉంటుందని భావిస్తున్నాయి.  అందుకే కార్మిక సంఘాలు మాత్రం నేరుగా చిరంజీవి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నాయి.
  Published by:Nagesh Paina
  First published: