THE ANNA DMK PARTY HAS ISSUED A STATEMENT URGING ITS LEADERS TO STAY AWAY FROM MEDIA CONFERENCES VB GH
Tamilanadu: అన్నాడీఎంకే మరో వినూత్న నిర్ణయం.. నేతలకు కీలక ఆదేశాలు..
AIADMK
Political News: తమిళనాడులో విపక్ష అన్నాడీఎంకే మరో తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికార ప్రతినిధులు మీడియాకు దూరంగా ఉండాలని ఏఐఏడీఎంకే నిర్ణయించింది. అన్నా డీఎంకే పార్టీని, నాయకుల ఇమేజ్ను తక్కువ చేయాలనే లక్ష్యంతో మీడియా ఉద్దేశపూర్వకంగా చర్చలు నిర్వహిస్తోందని పార్టీ ఆరోపిస్తోంది.
తమిళనాడులో విపక్ష అన్నాడీఎంకే మరో తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికార ప్రతినిధులు మీడియాకు దూరంగా ఉండాలని ఏఐఏడీఎంకే నిర్ణయించింది. పార్టీ మీడియా చర్చలను బహిష్కరించడంపై ఏఐఏడీఎంకే కోఆర్డినేటర్ పనీర్ సెల్వం, కో-కోఆర్డినేటర్ ఎడప్పాడి పళనిస్వామి రెండు రోజుల క్రితం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తాజాగా పార్టీ అధికార ప్రతినిధులు సైతం మీడియాకు దూరంగా ఉండాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. అన్నా డీఎంకే పార్టీని, నాయకుల ఇమేజ్ను తక్కువ చేయాలనే లక్ష్యంతో మీడియా ఉద్దేశపూర్వకంగా చర్చలు నిర్వహిస్తోందని పార్టీ అధినాయకత్వం ఆరోపించింది. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జయలలిత నెచ్చెలి శశికళ ప్రయత్నిస్తున్నారు. ఏఐఏడీఎంకే వలంటీర్లతో ఆమె మాట్లాడిన టెలిఫోన్ సంభాషణలు ఇటీవల రాష్ట్రంలో హల్చల్ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పార్టీ ప్రస్తుత నాయకత్వమే కారణమని ఆమె ఆరోపించింది. పార్టీని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా శశికళ పావులు కదుపుతుందని ఆడియో సంభాషణలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పనీల్ సెల్వం, పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు.
'ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియా, ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా.. అన్నా డీఎంకేను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీని కించపరిచే చర్యలను ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇలాంటి టీవీ చర్చలు బాధాకరమైనవి. ఏఐఏడీఎంకే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకునే బయటి వారి అభిప్రాయాలకు (శశికళను ఉద్దేశిస్తూ) మీడియా ప్రాధాన్యం ఇవ్వడం మానుకోవాలి’ అని పనీర్ సెల్వం, పళని స్మామి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత అన్నాడీఎంకే నాయకత్వంపై వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తూ, వారి వాదనను అంగీకరిస్తే.. మరిన్ని నిరసన గళాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నాయకత్వం వారిని బహిష్కరిస్తే, అది పార్టీకి మరింత నష్టాన్ని చేకూరుస్తుంది. వారందరూ వెంటనే అధికార డీఎంకేలో చేరుతారు. ఈ క్రమంలో కొందరు నేతలు వార్తా ఛానెళ్ల చర్చల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. మరోవైపు శశికళ సైతం మంచి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అందువల్ల ప్రస్తుతం టీవీ డిబేట్లకు నేతలను దూరంగా ఉంచడమే సరైన నిర్ణయమని పళనిస్వామి, పనీర్ సెల్వం భావిస్తున్నారు. ఈ నిర్ణయం టెలివిజన్ చర్చలకు మాత్రమే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ఇంటర్వ్యూలకు కూడా వర్తిస్తుందని ఉమ్మడి ప్రకటన స్పష్టంగా పేర్కొంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.