హోమ్ /వార్తలు /politics /

Uttar Pradesh: యూపీలో మొదలైన ఎన్నికల వేడి..  ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న అఖిలేష్​ నేతృత్వంలోని సమాజ్​వాదీ పార్టీ.. 

Uttar Pradesh: యూపీలో మొదలైన ఎన్నికల వేడి..  ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న అఖిలేష్​ నేతృత్వంలోని సమాజ్​వాదీ పార్టీ.. 

యూపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అఖిలేష్ (Akhilesh)​ నేతృత్వంలోని సమాజ్​వాదీ పార్టీ (Samajwadi party) ప్రచారంలోనే కాకుండా.. పొత్తులు పెట్టుకోవడంలోనూ దూసుకుపోతోంది. 

యూపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అఖిలేష్ (Akhilesh)​ నేతృత్వంలోని సమాజ్​వాదీ పార్టీ (Samajwadi party) ప్రచారంలోనే కాకుండా.. పొత్తులు పెట్టుకోవడంలోనూ దూసుకుపోతోంది. 

యూపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అఖిలేష్ (Akhilesh)​ నేతృత్వంలోని సమాజ్​వాదీ పార్టీ (Samajwadi party) ప్రచారంలోనే కాకుండా.. పొత్తులు పెట్టుకోవడంలోనూ దూసుకుపోతోంది. 

  aవ‌చ్చే ఏడాది ఉత్త‌రప్ర‌దేశ్‌ (Uttar Pradesh)లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. అయితే అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల సంద‌డి నెల‌కొంది. గత ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించి యోగీ ప్ర‌భుత్వం కొలువు తీరింది. ఈ నేప‌థ్యంలో కొన్ని స‌ర్వేలు యోగీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ అధికారంలోకి రావొచ్చ‌ని అంచానాల‌ను వెల్ల‌డించాయి. రాజ‌కీయంగా.. సామాజికంగా ఎన్నో వైవిధ్యాల‌కు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ చిరునామా.. ముస్లిం జ‌నాభా.. కుల స‌మీక‌ర‌ణాలు.. బ‌హుముఖ పోటీ మ‌ధ్య రాజ‌కీయం వేడెక్కుతోంది. ఇప్ప‌టికే బీజేపీ ఆప‌రేష‌న్ యూపీ ప్రారంభించింది. ఎన్నిక‌ల కోసం రాష్ట్రంలో కేంద్ర మంత్రుల‌ను ఇన్‌చార్జుల‌గా నియ‌మింఇంది. రీజియ‌న్ల వారీగా ప్ర‌చార క‌మిటీలను ఏర్పాటు చేసి ప్ర‌చారాన్ని ప్రారంభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ (BJP) అఖండ విజయం సాధిం చిన విషయం తెలిసిం దే. వచ్చే ఏడాది జరగబోయే ఎన్ని కల్లోనూ జయకేతనం ఎగురవేసేందుకు కాషాయ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది అన‌డంలో సందేహం లేదు. దీంతో అఖిలేష్ (Akhilesh)​ నేతృత్వంలోని సమాజ్​వాదీ పార్టీ (Samajwadi party) ప్రచారంలోనే కాకుండా.. పొత్తులు పెట్టుకోవడంలోనూ దూసుకుపోతోంది.

  రాష్ట్రీయ లోక్ దళ్​తో పొత్తు..

  వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో రాష్ట్రీయ లోక్ దళ్(RLD) పొత్తు ఖరారయ్యింది. సమాజ్‌వాది పార్టీ (Samajwadi party)తో తమ పార్టీకి పొత్తు ఉంటుందని ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి అధికారిక ప్రకటన చేశారు. అయితే పొత్తులో భాగంగా తమ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించనున్నారన్న అంశాన్ని వెల్లడించలేదు.

  వచ్చే ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల్లో గెలిచి యూపీ (UP)లో అధికారంలోకి వచ్చాక తాము చేయబోయే తొలి పని ఏంటో ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు విడిచిన రైతుల కోసం స్మారకాన్ని నిర్మించనున్నట్లు జయంత్ చౌదరి ప్రకటించారు.

  ఈ సారి అఖిలేష్​ పోటీ చేయట్లేదు..

  గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ కార‌ణంగా అధికారానికి దూర‌మైంది స‌మాజ్‌వాదీ పార్టీ (Samajwadi party). ఈ నేప‌థ్యంలో ఈసారి అఖిలేశ్ యాద‌వ్ కొత్త సాహ‌సానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సారి తాను పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించారు. పార్టీని ముందుడి న‌డిపిస్తానని ఇప్పటికే తెలిపారు. ఉత్తర ప్రదేశ్​లో 403 అసెంబ్లీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. యూపీతో పాటు పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

  ఒంటరి పోరుకే ఆయా పార్టీల మొగ్గు..?

  యూపీలో అధికార బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరి పోరుకు మొగ్గుచూపుతున్నాయి. దీంతో అక్కడ చతుర్ముఖ పోరు ఖాయంగా తెలుస్తోంది. అటు ఎంఐఎం కూడా యూపీలో తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. కొన్ని నియోజవర్గాల్లో ఎంఐఎం గట్టి పోటీ ఇవ్వడంతో పాటు.. ఇతర పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయొచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పెద్ద పార్టీలతో పొత్తు ఉండబోదని స్పష్టంచేసిన సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. అయితే చిన్న పార్టీలతో పొత్తులు ఉంటాయని గతంలో ప్రకటించారు.

  First published:

  ఉత్తమ కథలు