టీజీ వెంకటేష్ టంగ్ స్లిప్... నోరు జారి నాలుక కరుచుకున్న బీజేపీ ఎంపీ...

బీజేపీలో చేరి కొన్ని నెలలు గడిచిన తర్వాత కూడా టీజీ వెంకటేష్ తాము టీడీపీ ఎంపీలం అంటూ నాలుక కరుచుకున్నారు.

news18-telugu
Updated: February 3, 2020, 11:21 PM IST
టీజీ వెంకటేష్ టంగ్ స్లిప్... నోరు జారి నాలుక కరుచుకున్న బీజేపీ ఎంపీ...
టీజీ వెంకటేష్(ఫైల్ ఫోటో)
  • Share this:
బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ నోరు జారి నాలుకకరుచుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన హస్తినతో మీడియాతో మాట్లాడేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మూడు రాజధానులపై స్పందించారు. ‘చైనాలో ఉన్న తెలుగు వారిని తీసుకుని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం సంతోషం. ఈ సందర్భంగా మా తెలుగుదేశం ఎంపీలు..’ అంటూ నాలుక కరుచుకున్నారు. అయితే, దీనిపై వెంటనే స్పందించిన మీడియా ప్రతినిధులు మీరు బీజేపీలో ఉన్నారని గుర్తు చేశారు. దీంతో వెంటనే తన తప్పు గుర్తు చేసుకున్న ఆయన వెంటనే తెలుగు ఎంపీలు అంటూ సరిదిద్దుకున్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ టీడీపీని వీడి బీజేపీలో చేరి కొన్ని నెలలు గడుస్తోంది. అయితే ఈ రాజ్యసభ సభ్యుడు ఇంకా తాను టీడీపీలో ఉన్నానన్నట్టుగానే మాట్లాడారు.

రాష్ట్రంలో మూడు రాజధానులను టీజీ వెంకటేష్ తప్పుపట్టారు. ‘మీరు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని చెప్పగం సబబు. కానీ, మూడు ముక్కలాట సరికాదు. మీరు చేస్తున్నది అధికార వికేంద్రీకరణ కాదు. మూడుముక్కలాట. గ్రామాల్లో ఎలా అయితే అధికార వికేంద్రీకరణ చేశారో అలా చేయాలి. అంతే కానీ, మూడు ముక్కలు వద్దు. రాయలసీమలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, మినీ సెక్రటేరియట్‌లు ఏర్పాటు చేయండి. ఉత్తరాంధ్రలో అలాగే చేయండి. చీఫ్ సెక్రటరీని మాత్రం అమరావతిలోనే ఉంచండి. ఇది చేయకుండా మూడు ముక్కలాట ఆడితే భవిష్యత్తులో దెబ్బతింటుంది.’ అని అన్నారు.

తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన టీజీ వెంకటేష్.. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. సుజనా, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమను బీజేపీ రాజ్యసభాపక్షంలో విలీనం చేయాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు. దాన్ని వెంటనే రాజ్యసభ చైర్మన్ కూడా ఆమోదించారు. వారిని బీజేపీ సభ్యులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 3, 2020, 11:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading