టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు... మమ్మల్ని గెంటేయరన్న గ్యారెంటీ ఏంటి?

హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత అక్కడి నుంచి తన్ని తరిమేసినట్టు విశాఖ అభివృద్ధి చెందిన తర్వాత మరోసారి రాయలసీమ వారిని గెంటేయరన్న గ్యారెంటీ ఏంటని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు.

news18-telugu
Updated: December 30, 2019, 10:12 PM IST
టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు... మమ్మల్ని గెంటేయరన్న గ్యారెంటీ ఏంటి?
టీజీ వెంకటేష్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసి.. ఆ రెండూ అభివృద్ధి చెందిన తర్వాత రాయలసీమ వారిని తరిమేయరన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. రాయలసీమలో సచివాలయం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాయలసీమ తరఫున నేను ఒక్కటే అడుగుతున్నా. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ రాజధాని ఉండేది. విడిపోయాక బంగారు పళ్లెంలో తీసుకెళ్లి అమరావతిలో రాజధాని పెట్టారు. అమరావతి వెళ్లడమే చాలా కష్టం అవుతుందంటే, ఇప్పుడు జగన్ అదే బంగారు పళ్లెంలో తీసుకెళ్లి విశాఖలో పెడుతున్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ రాయలసీమవారే. సీమ వారికి పొరుగింటి పుల్లకూర రుచి. తమ ప్రాంతం వారి కంటే ఇతర ప్రాంతాల వారిని బాగా చూసుకోవాలని ఉంటుంది. ఒకాయన అమరావతి పరిగెత్తారు. మరొకరు విశాఖ పరిగెత్తారు. అన్ని ప్రాంతాలు కలసి ఉండాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఒకే ప్రాంతం డెవలప్ అయితే, హైదరాబాద్ నుంచి గోచీ లాగి తన్ని తరిమేసినట్టు అదే పరిస్థితి మళ్లీ వస్తుంది. అప్పుడు మూడు రాష్ట్రాలు అయ్యే అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది.’ అని టీజీ వెంకటేష్ అన్నారు.

First published: December 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు