TENSION SITUATION IN SOME MINSTERS IN ANDHRA PRADESH CABINET THERE IS SOME SPECULATION IN CHANGES NGS
AP Cabinet: ఏపీ మంత్రుల్లో దడ.. పదవి ఉంటుందా లేదా అనే టెన్షన్.. ఎన్నికల టీంపై సీఎం ఫోకస్
మంత్రుల్లో టెన్షన్ టెన్షన్
ఏపీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగు సాగుతోంది. అయితే తమ పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక.. సన్నిహిత మంత్రుల దగ్గర తమ పరిస్థితి ఏంటని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ కేబినెట్ నుంచి ఔట్ అయ్యే మంత్రులు ఎవరు..?
ఏపీ సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? మంత్రి వర్గ కూర్పులో మార్పు తప్పని సరి అనే ప్రచారం జరుగుతోంది. ఈ డిసెంబర్ లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై గతంలోనే సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. భారీగా మార్పులు చేస్తారా..? మూడు నాలుగు మార్పులతో సరిపెడతరా అన్నది చూడాలి. అయితే ఇప్పటికే రెండున్నరేళ్ల కాలం అయిపోవడంతో రాబోయే ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్ చేస్తున్నారని.. తన ఎన్నికల టీంను రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ఈ సారి భారీగా మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే కేబినెట్ లో ఎవరికి చోటివ్వాలి అనే దానిపై ఆయన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరుపైన జనగ్ రిపోర్టులు తెప్పించుకుంటున్నారని సమాచారం. మరో రెండు మూడు నెలల్లో కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసుకున్నట్టు సమాచారం.
ఇదే ఇప్పుడు ఏపీ మంత్రుల్లో దడ పెంచుతోంది. మంత్రి పదవులు తీసుకున్నా పూర్తి స్థాయిలో పని చేసేందుకు అవకాశం ఏర్పడలేదని.. ఇప్పుడు విస్తరణలో తమ పదవులు పోతే పరిస్థితి ఏంటని కొందరు మంత్రులు సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్టు ప్రచారం ఉంది. దేవదాయ శాఖ మంత్రి తన పదవిపై అనుమానంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
కొందరు మంత్రులు కేబినెట్ విస్తరణపై సైలెంట్ గా ఉండడమే బెటరని సన్నిహితులకు సలహా ఇస్తున్నారట.. అసలు కేబినెట్ లో మార్పులు చేసే ఉద్దేశమే అధినేతకు లేదని.. అనవసరంగా లాబీయింగ్ పేరుతో సీఎం వరకు విషయం వెల్లడం మంచిది కాదని చెప్పి ఓదారుస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు మంత్రులైతే సీఎం జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చెప్పలేమని.. అయన నిర్ణయం తీసుకుంటే ఎవరు చెప్పినా వినరని.. సామాజిక సమీకరణాలు, ఇతర లెక్కలు, గతంలో ఇచ్చిన హామీలు అన్నీ బేరీజు చేసుకుని ఆయన నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
సీఎంకు అంత్యంత సన్నిహితుడిగా ఉండే మంత్రి మాత్రం ఇతరులకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్ లో మార్పులు చేర్పులు గురించి ఎవరూ మాట్లాడ వద్దని.. ఈ వ్యవహారంపై కొంతమంది మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని.. ఎవరు ఎన్ని రకాలుగా లాబీయింగ్ చేసినా.. జగన్ అవి పట్టించుకోరని తాను అనుకున్న వారికే మంత్రి పదవిులు కట్టబెడతారని చెబుతున్నారు.
అయితే తాత్కాలికంగా మంత్రి మండలిలో మార్పులు చేర్పుల విషయాన్ని జగన్ పక్కన పెట్టినా.. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే 90 శాతం మార్పులతో తన ఎన్నికల టీంను రెడీ చేసుకుంటారని సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలా మంది కలవరపాటుకు గురవుతున్నారు. ఈ సమయంలో మంత్రి పదవి నుంచి తప్పిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఆ ప్రభావం పడుతుందని భయపడుతున్నారు. అందుకే సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.