• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • TENSION SITUATION IN CHANDRABABU NAIDU HOUSE AT HYDERABAD SOME NEW PERSONS FOUND SURROUNDINGS NGS

Andhra Pradesh: ఏ క్షణమైనా చంద్రబాబుకు నోటీసులు... అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం... నివాసం దగ్గర అనుమానిత వ్యక్తి

చంద్రాబాబుకు ఏ క్షణమైనా నోటీసులు

హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. చంగ్రబాబుకు ఏ క్షణమైనా కర్నూలు పోలీసులు నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి చంద్రబాబు ఇంటి ముందు తిరుగుతూ కనిపించడంపై అనుమానాలు పెరుగుతున్నాయి.

  • Share this:
    ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర ఆ అనుమానిత వ్యక్తి తిరగడాన్ని గుర్తించారు. దీనిపై హైదరాబాద్ లో పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అనుమానిత వ్యక్తులు ఇలా వస్తుండడంపై టీడీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రాబు నాయుడుకు కర్నూలు పోలీసులు ఏ క్షణమైనా నోటీసులు జారీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నిన్న రాత్రి 10 గంటలకే కర్నూలు పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. కానీ చంద్రాబుకు నోటీసులు మాత్రం ఇవ్వడం లేదు.. ఇప్పుడు ఏ క్షణమైనా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది.

    ఎన్‌440కే స్ర్టెయిన్‌ కొవిడ్‌ వైరస్‌ కర్నూలులో ఉందని చెప్పి చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేశారని సుబ్బయ్య అనే న్యాయవాది వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం.. ఈ మేరకు పోలీసులు వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఆయనకు సీఆర్‌పీసీ 41 కింద నోటీసులు ఇచ్చేందుకు సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలోని ఓ బృందం హైదరాబాద్‌ చేరింది. అయితే దీనిపై నోటీసులు ఇస్తున్నారా అని మీడియా ప్రశ్నిస్తే.. కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నామని తరువాతే నోటీసులు ఇస్తామని సమాధానం ఇచ్చారు.

    సుబ్యయ్య అనే వ్యక్తి ఫిర్యాదుతో చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 155, 505(1) (బి) (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే చంద్రబాబును అరెస్ట్ చేసేందుకే ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారని... ఇదంతా సీఎం జగన్ మోహర్ రెడ్డి డైరక్షన్ లోనే పోలీసులు కేసు నమోదు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    అసలు ఈ వివాదం ఏపీలో ఏ వైరస్ ఉందని అన్న చర్చతో మొదలైంది. కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్-440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు పలుసార్లు వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని అన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. జూమ్ ద్వారా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు.. ఈ విషయంలో ఆవేదనతోనే మాట్లాడతున్నామని వ్యాఖ్యానించారు. బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదని ఏపీ ప్రభుత్వం చెప్పడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని చంద్రబాబు అన్నారు.

    చంద్రబాబును అరెస్ట్ చేయాలని జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారని.. అయితే చంద్రబాబు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. అందుకే ఏ కేసులు పని చేయడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే ఇలాంటి తప్పుడు కేసులతో రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. న్యాయస్థానాల ద్వారా అక్రమ కేసులపై పోరాడుతామంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published: