Police lathi-charge: అనంతపురంలో విద్యార్థులపై పోలీస్ లాఠీ విరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు ఖాకీలు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొంతమంది తలలు పగిలాయి. దీంతో అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం పోలీసుల తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి..
Police lathi-charge: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పోలీసుల తీరు మరోసారి విదాస్పదమైంది. అనంతపురం (anantapuram)లో ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల, పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు రోడ్డెక్కారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఎస్ఎస్బీఎన్ కాలేజీ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం (AP Government) చదువులను వ్యాపారం చేస్తోందని ధర్నాకు దిగారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు ఆందోళన (Students Protest)లో పాల్గొన్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్ల విలీనం వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఎస్ఎస్బీఎన్ కాలేజీ దగ్గర విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎప్ విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఎస్ఎస్బీఎన్ కాలేజీ, స్కూల్ విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
కాలేజీ యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరించింది. ఇందుకు సంబంధించిన పత్రాన్ని సైతం విద్యాశాఖ పంపించింది. ఈ వ్యవహారంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. విలీనాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. కాలేజీ, స్కూల్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఫీజులను కట్టలేమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాఠీఛార్జ్ అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించి లాఠీఛార్జ్‌కి దిగారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు నారా లోకేష్. ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని ఖండించారు నారా లోకేష్. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. http://
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం @ysjagan అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలో ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/14TKhQIGyt
విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని ప్రశ్నించారు. విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంతైనా నేలకొరగడం ఖాయమని అభిప్రాయపడ్డారు లోకేష్. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వైసీపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు లోకేష్.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.