news18-telugu
Updated: October 14, 2019, 4:48 PM IST
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాాడా వెంకట్ రెడ్డి,సీఎం కేసీఆర్
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన సీపీఐ... ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో సపోర్ట్‌పై వెనక్కి తగ్గుతుందా ? ఆర్టీసీ కార్మికులతో చర్చలపై ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో సీపీఐ కీలక నిర్ణయం తీసుకుంటుందా ? ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలను టెన్షన్ పెడుతోంది. ఆర్టీసీ సమ్మె, సమ్మెపై ప్రభుత్వ వైఖరి గురించి చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లో సమావేశమైంది. సీపీఐ ముఖ్యనేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డితో పాటు ఆ పార్టీ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులతో ఈ నెల 13లోపు చర్చలు జరపాలని సీపీఐ గతంలోనే ప్రభుత్వానికి సూచించింది. ఈ గడువు ముగియడం... ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో... హుజూర్ నగర్లో టీఆర్ఎస్కు మద్దతిచ్చే అంశంపై సీపీఐ పునరాలోచనలో పడింది. ఇంకా టీఆర్ఎస్కు మద్దతిస్తే కార్మికులు దృష్టిలో తాము విలన్‌గా మిగిలిపోతామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
దీంతో ఆర్టీసీతో చర్చలపై ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడమో లేక హుజూర్ నగర్లో టీఆర్ఎస్కు మద్దతు ఉపసంహరణపై నిర్ణయం తీసుకోవడమో చేయాలని సీపీఐ భావిస్తోంది. ఈ భేటీలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశంలో సీపీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే అంశం టీఆర్ఎస్ వర్గాలను టెన్షన్ పెడుతున్నట్టు సమాచారం.
Published by:
Kishore Akkaladevi
First published:
October 14, 2019, 4:48 PM IST