ఏపీ కాంగ్రెస్‌కు కొత్త బాస్... తెలంగాణలో టెన్షన్...

ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఎంపిక అంశం... తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ పెంచినట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: January 16, 2020, 8:08 PM IST
ఏపీ కాంగ్రెస్‌కు కొత్త బాస్... తెలంగాణలో టెన్షన్...
తెలంగాణ కాంగ్రెస్
  • Share this:
కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న ఏపీ పీసీసీ చీఫ్ పదవిని ఆ పార్టీ హైకమాండ్ భర్తీ చేసింది. మాజీమంత్రి శైలాజానాధ్‌కు ఈ పదవిని కట్టబెట్టింది. ఏపీలో కొత్త పీసీసీ చీఫ్ ఎవరనే దానిపై ఎవరికీ పెద్ద ఆసక్తి లేకపోయినప్పటికీ... ఏపీతో పాటే తెలంగాణకు కూడా కొత్త పీసీసీ చీఫ్‌ను కాంగ్రెస్ ప్రకటిస్తుందని చాలాకాలం ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ పేరును ప్రకటించిన ఆ పార్టీ అధినాయకత్వం... తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త పీసీసీ చీఫ్ పేరును మాత్రం ప్రకటించలేదు. ఇందుకు తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలే కారణమని వేరే చెప్పనవసరం లేదు.

అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ కొత్త చీఫ్ విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందా ? అనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. కొందరు టీపీసీసీ కొత్త అధ్యక్షుడి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుందని... మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తరువాత ఆ పేరును ప్రకటించే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగానే ఈ పదవిని విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఎవరైతే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారో... వారికే తెలంగాణ టీ పీసీసీ పీఠాన్ని కట్టబెట్టాలనే యోచనలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఎంపిక అంశం... తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ పెంచినట్టు కనిపిస్తోంది.First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>