Home /News /politics /

కోడెల అంతిమయాత్రలో ఉద్రిక్తత...

కోడెల అంతిమయాత్రలో ఉద్రిక్తత...

ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరు జిల్లాలోని  ప్రవేశించిన కోడెల పార్థివ దేహం (File)

ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరు జిల్లాలోని ప్రవేశించిన కోడెల పార్థివ దేహం (File)

అంతిమయాత్ర దారిలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెందిన ఆస్పత్రి కనిపించగానే టీడీపీ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు చేశాయి.

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. కోడెల నివాసం నుంచి శ్మశాన వాటిక వరకు భారీ ఎత్తున అంతిమయాత్ర జరిగింది. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరై.. పల్నాటి పులిగా పేరుపొందిన శివప్రసాదరావుకు వీడ్కోలు పలికారు. అయితే, అంతిమయాత్ర దారిలో ఉద్రిక్తత తలెత్తింది. అంతిమయాత్ర దారిలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెందిన ఆస్పత్రి కనిపించగానే టీడీపీ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు చేశాయి. ఓ దశలో కొందరు కార్యకర్తలు ఆ ఆస్పత్రి వైపునకు దూసుకెళ్లారు. అయితే, పోలీసులు వారిని కంట్రోల్ చేశారు. నేతలు కూడా వారించడంతో కార్యకర్తలు వెనక్కి తగ్గారు.

    రెండు రోజుల క్రితం కోడెల తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. నరసరావుపేటలోని ఆయన అంత్యక్రియిలు నిర్వహిస్తున్నారు. కోడెలకు అంతిమవీడ్కోలు పలికేందుకు వేలాదిగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Kodela death, Narasaraopet, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు