పవన్ కళ్యాణ్ గెలిచేది ఎక్కడ ? జనసేనలోని టెన్షన్ టెన్షన్

ఎగ్జిట్ పోల్స్ తరువాత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి గెలుస్తారనే అంశంపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

news18-telugu
Updated: May 21, 2019, 10:09 AM IST
పవన్ కళ్యాణ్ గెలిచేది ఎక్కడ ? జనసేనలోని టెన్షన్ టెన్షన్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ఎన్నికల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించే స్థాయిలో తమకు సీట్లు వస్తాయని అంచనా వేసింది పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన. ఎన్నికల్లో పాతిక సీట్లు గెలుచుకోగలిగితే... కర్ణాటకలో కుమారస్వామి తరహాలో ఏపీకి పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని చాలామంది భావించారు. జనసేన సైతం తాము అధికారంలో వస్తామని కాకుండా కింగ్ మేకర్ పాత్ర పోషిస్తామని చెప్పుకుంది. పలు జిల్లాల్లో తమ పార్టీ హవా ఎక్కువగా ఉందని... అక్కడ ఎక్కువ సీట్లు తమకే వస్తాయని జనసేన అంచనా వేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన తరువాత ఆ పార్టీలో నైరాశ్యం కనిపిస్తోంది.

దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ జనసేన సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితమవుతోందని...ఆ పార్టీకి రెండు మూడు సీట్లకు మించి రావని అంచనా వేశాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి గెలవబోతున్నారనే అంశంపైనే నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్. రెండు చోట్ల తాను గెలుస్తానని పవన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఏదో ఒక స్థానం నుంచే గెలుస్తారని.. మరో చోట ఓడతారనే ఊహాగానాలు వినిపించాయి.

భీమవరంలో పవన్ కళ్యాణ్‌కు వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను గట్టి పోటీ ఇచ్చారని... హోరాహోరీ పోరులో ఆయనే విజయం సాధించే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. అయితే గాజువాకలో ఆయన సులువుగా గెలుస్తారని జనసేన వర్గాలు అంచనా వేశాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. పవన్ కళ్యాణ్ గాజువాకకు బదులుగా భీమవరం నుంచే గెలుస్తారని ప్రచారం మొదలైంది. దీంతో అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి గెలుస్తారు ? అసలు గెలుస్తారా లేదా అనే దానిపై జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
Published by: Kishore Akkaladevi
First published: May 21, 2019, 10:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading