Home /News /politics /

TENSION AMONG TRS ON WARANGAL VIJAYAGHARJANA MEETING IF ETELA RAJENDAR WINS IN HUZURABAD AK

ఈటల రాజేందర్ గెలిస్తే ఆ సభ పరిస్థితి ఏంటి.. TRSలో టెన్షన్ ?

ఈటల రాజేందర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

TRS Warangal Meeting: ఒకవేళ హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ విజయం సాధిస్తే మాత్రం ఈ సభ పరిస్థితి ఏమిటనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

    హుజూరాబాద్‌లో గెలుపు ఎవరిది అనే విషయం మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా విజయం ఈటల రాజేందర్‌తో అనే చెబుతున్నా.. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం గెల్లు శ్రీనివాస్ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఈటల రాజేందర్ గెలిస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ మార్పులు వస్తాయనే చర్చ కూడా మొదలైంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్‌లో హుజూరాబాద్ ఫలితానికి సంబంధించి మరో టెన్షన్ కూడా మొదలైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో విజయగర్జన సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 15న పెద్ద ఎత్తున ఈ సభను నిర్వహించాలని దాదాపుగా డిసైడయ్యింది. దాదాపు 10 లక్షల మందితో భారీ ఎత్తున స‌భ‌ను ఈ సభ నిర్వహించి, విజయవంతం చేయాలని పార్టీ ముఖ్యనేతలకు కేసీఆర్ సూచించారు.

    ఇంతవరకు బాగానే ఉన్నా.. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే వరంగల్ విజయగర్జన సభ సంగతేంటనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో మొదలైనట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ 20 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తుకు తెచ్చేలా ఈ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావించింది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టి అంతా హుజూరాబాద్ ఫలితంపైనే నెలకొంది. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే.. వరంగల్ విజయగర్జన సభను టీఆర్ఎస్ మరింత ఘనంగా నిర్వహించుకోవడానికి ఉత్సాహం లభిస్తుంది.

    ఒకవేళ హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ విజయం సాధిస్తే మాత్రం ఈ సభ పరిస్థితి ఏమిటనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అధికార పార్టీ పెద్ద ఎత్తున సభ నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కీలకమైన ఉప ఎన్నిక, అందులోనూ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వస్తే.. అది కచ్చితంగా పార్టీ శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందనే పలువురు అభిప్రాయపడుతున్నారు.

    KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

    YS Sharmila: ఊహించని విధంగా వైఎస్ షర్మిలను ఇరికించిన వైసీపీ

    అంతేకాదు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత టీఆర్ఎస్ ఈ రకమైన సభను నిర్వహిస్తే.. విపక్షాలు మరింత ఎక్కువగా టార్గెట్ చేస్తాయనే భావన కూడా టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. అయితే టీఆర్ఎస్ 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో చూసుందని.. కాబట్టి హుజూరాబాద్ ఫలితంలో సంబంధం లేకుండానే విజయగర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ నాయకత్వం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఫలితం ప్రతికూలంగా ఉంటే భారీ సభ విషయంలో టీఆర్ఎస్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Huzurabad By-election 2021, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు