Home /News /politics /

TENSION AMONG TRS LEADERS AFTER SIDDIPET COLLECTOR VENKATRAMI REDDY RESIGNED FOR HIS POST WILL CM KCR GIVE HIM MLC POST AK

Siddipet కలెక్టర్ రాజీనామా.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?.. టీఆర్ఎస్ నేతల్లో మొదలైన టెన్షన్

కేసీఆర్, వెంకట్రామిరెడ్డి (ఫైల్ ఫోటో)

కేసీఆర్, వెంకట్రామిరెడ్డి (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్యే లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తే.. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఉన్న నేతల్లో ఒకరో ఒకరి అవకాశం గల్లంతయినట్టే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

    తెలంగాణలో ఖాళీగా ఉన్న 19 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉండటంతో.. ఆ దిశగా ముమ్మరం కసరత్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే కొన్ని పేర్లను ఖరారు చేశారని.. మరికొద్ది గంటల్లోనే ఈ పేర్లను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎవరికి మళ్లీ ఛాన్స్ ఉంటుందనే దానిపై క్లారిటీ రాకపోయినా.. ఎమ్మెల్సీ కోటా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, మధుసూదనాచారి, ఎర్రోళ్ల శ్రీనివాస్, తక్కెళ్లపల్లి రవీందర్, ఎంసీ కోటిరెడ్డి, కౌశిక్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఉన్నట్టుండి సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో.. కొత్త ఊహాగానాలకు తెరలేచింది.

    వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఛాన్స్ ఇవ్వబోతున్నారని.. ఈ మేరకు స్పష్టమైన హామీ రావడంతోనే వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది. వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దాదాపు ఖాయమైనట్టే అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆయనకు ఏ కోటాలో సీఎం కేసీఆర్ ఈ అవకాశం ఇస్తారనే ఉత్కంఠ టీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ రేసులో నిలిస్తే.. ఆయన ఎవరో ఒక టీఆర్ఎస్ నాయకుడి పదవికి చెక్ చెప్పినట్టే అని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    ఒకవేళ సీఎం కేసీఆర్ ఆయనను ఎమ్మెల్యే లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తే.. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఉన్న నేతల్లో ఒకరో ఒకరి అవకాశం గల్లంతయినట్టే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా వెంకట్రామిరెడ్డిని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చినా.. అక్కడ కూడా ఆయన ఎవరో ఒకరికి దక్కాల్సిన పదవికి ఎసరుపెట్టడం ఖాయమనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

    రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..

    Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి

    అయితే సిద్ధిపేట కలెక్టర్‌గా ఎక్కువకాలం విధులు నిర్వర్తించిన వెంకట్రామిరెడ్డికి మెదక్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కేసీఆర్ ఇస్తారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. అదే జరిగితే.. ఇప్పటివరకు ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహించిన భూపాల్ రెడ్డికి మరోసారి రెన్యువల్ లేనట్టే అని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి హఠాత్తుగా కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి.. టీఆర్ఎస్ నేతల్లో కొత్త టెన్షన్ క్రియేట్ చేసినట్టు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Siddipet, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు