CM Jagan – CM KCR: సాయంత్రం కేసీఆర్.. రేపు ఉదయం జగన్.. తెలుగు రాష్ట్రాల సీఎలం హస్తిన బాట.. మ్యాటర్ ఏంటి..?

కేసీఆర్, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Telugu CM’s Delhi Visit: తెలుగు రాష్ట్రాల సీఎంలు హస్తిన బాట పట్టారు. ఇవాళ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండగా.. సీఎం జగన్ రేపు ఉదయం హస్తినకు వెళతారు. పేరుకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ సమావేశానికి హాజరు అవుతున్నా.. వెనుక ఏదో రీజన్ ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఇద్దరి సీఎంల హస్తిన టూర్ వెనుక మ్యాటర్ ఏంటి..?

  • Share this:
    Telugu CM's Delhi Visit: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhr Pardesh CM Jagan Mohan Reddy)రేపు ఢిల్లీ (Delhi) వెళతారు. మావోయిస్టు (Maoist)ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ (Central Home minstery) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి హాజరవుతారు ముఖ్యమంత్రి జగన్‌. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Home Minster Amit Shah) అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ (Telangana CM KCR)సైతం ఈ భేటీకి హాజరవుతారు. ఈ సాయంత్రమే కేసీఆర్ ఢిల్లీకి చేరుకుంటారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఈ సందర్భంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించనున్నారు. ఢిల్లీ సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్ హోం శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు, ఆర్​అండ్ బీ ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రం తరఫున కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా హోం శాఖ ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు.

    ఇదీ చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడ పడతాయంటే..?

    మరోవైపు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌, పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ లేఖలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది.

    ఇదీ చదవండి: కదులుతోన్న డొంక.. ప్రధాన నిందితులు అరెస్ట్.. స్కామ్ ఎలా చేశారంటే..?

    ఈ సమావేశాలకు ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరు అవ్వడం పై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి సమావేశాలకు అధికారులను పంపించి.. సీఎంలు దూరంగా ఉంటారు. ఇంత అకస్మాత్తుగా సీఎంలు ఇద్దరు వెళ్తుండడపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీలో సుదీర్ఘంగా ఉన్నారు. మళ్లీ ఆయన ఇప్పుడు వెళ్తుండడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఆయన రహస్య సమావేశం ఉంటుందని తెలుస్తోంది. ఇటు సీఎం జగన్ కూడా ఇప్పటికే పలువురి అపాయింట్ మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కారణాలు.. విజభజన సమస్యలపైనా చర్చించే అవకాశం ఉంది. అలాగే నీటి వాటాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు ఉన్నాయి. వీటిపైనా ఢిల్లీల పర్యటనలో ఇద్దరు చర్చించుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.. వీటిన్నిటికంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు.. భవిష్యత్తులో కేంద్రంలో మద్దతు తదితర అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
    Published by:Nagesh Paina
    First published: