హోమ్ /వార్తలు /politics /

YSRCP-TDP: ఆ ఐడియా మనకెందుకు రాలేదబ్బా..? జగన్ ప్రచార వ్యూహంపై టీడీపీలో చర్చ..!

YSRCP-TDP: ఆ ఐడియా మనకెందుకు రాలేదబ్బా..? జగన్ ప్రచార వ్యూహంపై టీడీపీలో చర్చ..!

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో (Telugu Desham Party) మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వం ప్రచార వ్యూహాలపై తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్న తీరు చూస్తే.. మనం నోరెళ్ళ బెట్టాల్సిందే.

M.BalaKrishna, Hyderabad, News18

అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాయి. గల్లీ నుంచి పరిస్థితులను గమనిస్తూ.., పార్టీలో తీసుకు రావాల్సిన అంశంపై ప్రతిపక్షంలో నిత్యం చర్చ సాగుతూ ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాలకు తగ్గట్టుగా నిరసన కార్యక్రమాలు., ధర్నాలు చేపడుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party)లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వం ప్రచార వ్యూహాలపై తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్న తీరు చూస్తే.. మనం నోరెళ్ళ బెట్టాల్సిందే. తమ్ముళ్ల కళ్లన్నీ ప్రస్తుతం డ్రోన్ కెమెరాలపై పడ్డాయి. ఎందుకు అని ప్రశ్నవేస్తే....?? విచిత్రమైన అంశాన్ని చెప్పేస్తున్నారు టీడీపీ నేతలు. సాధారణంగా డ్రోన్ కెమెరాలను విజువల్స్ తీసేందుకు వినియోగిస్తారు. నింగిలో దూసుకెళ్తూ.... సభ సమావేశాలను డ్రోన్స్ ద్వారా చిత్రీకరిస్తే ఆ లుక్ ఆ వేరు.

ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఈ నయా ట్రెండ్ ను 2019 ఎన్నికలకు ముందే సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. జనసమూహాల మధ్య అలా అలా వెళ్తున్న జగన్ విజువల్స్ అప్పట్లో సెన్సేషన్ గా మారాయి. ఆ విజువల్స్ ను తీసింది కూడా డ్రోన్ కెమెరాల ద్వారానే. ఇలా ప్రతక్షంలో ఉన్నప్పుడు గతంలో పాదయాత్ర, బహిరంగ సభల దృశ్యాలను కూడా డ్రోన్‌ ద్వారానే రికార్డ్‌ చేసి రిలీజ్‌ చేసేవారు. ఆ విజువల్స్‌ జనాలకు కనువిందు చేసేవి. ఇక సీఎం జగన్ ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టిన డ్రోన్స్ ను వినియోగిస్తున్నారు.

ఇది చదవండి: కీలక పదవుల భర్తీకి సీఎం జగన్ కసరత్తు... లిస్టులో ఉన్న నేతలు వీళ్లేనా..?ఇటీవల వైసీపీ సర్కార్‌ చెత్త సేకరణ వాహనాలను ఒకేసారి అన్ని జిల్లాకు పంపింది. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఒకేసారి 4 వేల వాహనాలను లాంఛ్‌ చేశారు. ఈ సందర్భంగా డ్రోన్‌ కెమెరాతో షూట్‌ చేసి మీడియాకు రిలీజ్‌ చేశారు. ఆ డ్రోన్‌ విజువల్స్‌ జనాల అటెన్షన్‌ తీసుకొచ్చాయి. ఆ విజువల్‌ ఇంపాక్ట్‌ పైనే టీడీపీలో చర్చ జరుగుతోందట. చెత్త సేకరణ వాహనాలకన్నా ముందే అదే బెంజ్‌ సర్కిల్‌ నుంచి 108, 104 అంబులెన్స్‌లను, రేషన్‌షాప్‌ సరుకులు తీసుకెళ్లే వాహనాలను లాంఛ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రతి జిల్లాలకు వాహనాలను పంపారు. భారీ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో కూడా డ్రోన్‌ విజువల్స్‌ను రికార్డ్‌ చేసి మీడియాకు రిలీజ్‌ చేసింది వైసీపీ ప్రభుత్వం‌.

ఇది చదవండి: సీఎం జగన్ కు రోజా సర్ ప్రైజ్... అందుకే ఆమె చాలా స్పెషల్..


ఇప్పుడు అవే దృశ్యాలను చూసి టీడీపీ కళ్లు కుట్టుకునే పరిస్థితి ఉందట. ఇలాంటి డ్రోన్ షాట్స్ అంశాలే టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారంలో ఉన్నన్ని నాళ్ళు ఇలాంటి ఐడియాలు ఎందుకు రాలేదని ప్రశ్నించుకుంటున్నారట. టీడీపీ పార్టీ జరిపిన అన్ని సమావేశాల్లో మాజీ మంత్రులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారట. టీడీపీ అధికారంలో ‌ఉండగా.., రైతురథం పేరుతో 13 జిల్లాలకు సుమారు 20 వేల ట్రాక్టర్లు ఇచ్చి ఉంటామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పార్టీ అధిష్టానానికి తెలిపారట. అప్పుడు ఇదే విధంగా ట్రాక్టర్లను ఒకచోట పెట్టి లాంఛ్‌ చేసి ఉంటే బాగుండేదని తమ్ముళ్లు బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

ఇది చదవండి: ఏపీలో రైతులకు శుభవార్త... ఈ పంటల సాగుకు ప్రోత్సాహం..ఈ అంశం తెలిసినప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో భారీగా మరో చర్చ సాగుతోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తామే ప్రవేశ పెట్టె పార్టీ టీడీపీ అంటూ ప్రచారానికి మాత్రమే పరిమితమా అంటూ సెటైర్ లు వేస్తున్నారట. టెక్నాలజీని ప్రవేశపెట్టడమే కాదు… వాడుకోవడమూ తెలియాలని ఎద్దేవా చేసేవారు లేకపోలేదట. మొత్తానికి డ్రోన్‌ కెమెరా విజువల్స్‌ ప్రభావం ఎలా ఉన్నా.. ఆ దృశ్యాలు మాత్రం టీడీపీని బాగానే కలవర పెడుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, TDP, Ysrcp

ఉత్తమ కథలు