• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELUGU DESHAM PARTY SUPPORTERS WON IN NARA CHANDRA BABU NAIDUS OWN VILLAGE NARAVARIPALLE IN KANDULAVARIPALLE IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH PRN

AP Panchayat Elections: చంద్రబాబు స్వగ్రామంలో ఫలితం ఇదే... ఆ పార్టీకి షాకిచ్చిన ఓటర్లు

AP Panchayat Elections: చంద్రబాబు స్వగ్రామంలో ఫలితం ఇదే... ఆ పార్టీకి షాకిచ్చిన ఓటర్లు

చంద్రబాబు స్వగ్రామంలో టీడీపీ గెలుపు

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంమైన టీడీపీ అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) స్వగ్రామమైన కందులవారిపల్లె పంచాయతీలో టీడీపీ (TDP) విజయం సాధించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా  అందరి దృష్టిని ఆకర్షించిన చంద్రబాబు స్వగ్రామమైన కందులవారిపల్లె పంచాయతీలో టీడీపీ ఘన విజయం సాధించింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె.. కందులవారిపల్లె పంచాయతీ పరిధిలో ఉంది. ఈ గ్రామంలో 10 వార్డులుండగా.. 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 8 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా.. 8 వార్డుల్లోనూ టీడీపీ మద్దతుదారులే విజయం సాధించారు. టీడీపీ మద్దతుతో బరిలో నిలిచిన బొబ్బా లక్ష్మి 563 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో నారావారిపల్లెలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కందులవారిపల్లె పంచాయతీని కైవసం చేసుకొని చంద్రబాబుకు షాకివ్వాలని వైసీపీ యత్నించినా ఓటర్లు మాత్రం టీడీపీకి అనుకూలంగా తీర్పునిచ్చారు.

    చంద్రబాబు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కందులవారిపల్లెలో ఎలాగైనా వైసీపీ మద్దతుదారులను గెలిపించాలని వైసీపీ నేతలు వ్యూహం రచించినా ఇక్కడ మాత్రం అవేం పనిచేయలేదని తెలుస్తోంది. పైగా ఇదే గ్రామంలో రెండు వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది కూడా.

    ఇది చదవండి: ఎన్నికల ప్రచారంలోకి శ్రీవారి లడ్డూలు తీసుకొచ్చిందెవరు..? టీటీడీకి తెలయకుండానే జరిగిందా..?



    ఇక చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ విషయానికి వస్తే 89 పంచాయతీలకుగానూ 75 వైసీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసిన వైసీపీ ఆయనకు ఊహించని షాకిచ్చింది. 70 పంచాయతీల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకున్న టీడీపీని 14 స్థానాలకే పరిమితం చేసింది వైసీపీ. రామకుప్పం, శాంతిపురం మండలంలో వైసీపీ స్వీప్ చేసింది. కుప్పంలో మొత్తం 1,68,058 ఓట్లు పోలైతే.. అందులో వైసీపీకి 31,149 ఓట్ల మెజారిటీ వచ్చింది. టీడీపికి 14 పంచాయతీల్లో 1872 ఓట్ల మెజారిటీ వచ్చింది. మరి కుప్పం రిజల్ట్ తన నియోజకవర్గంలో రిపీట్ కాకుండా బాలయ్య అడ్డుకట్ట వేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఐతే బాలయ్య అభిమానులు మాత్రం కుప్పం వేరు.. హిందూపురం వేరంటున్నారు. ఇక్కడ బాలయ్యను కొట్టేవారే లేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు