Home /News /politics /

TELUGU DESHAM PARTY STATE PRESIDENT KINJARAPU ATCHENNAIDU MADE SENSATIONAL COMMENTS ON POLICE AND COMMENTS I WOULD BE THE HOME MINISTER PRN

Atchannaidu Arrest: హోం మంత్రి అవుతా.. అందరి లెక్కలు తేలుస్తా.. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

అచ్చెన్నాయుడు (File)

అచ్చెన్నాయుడు (File)

ఆంధ్రప్రదశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) కాకరేపుతున్నాయి. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య నున్నానేనా అనే రేంజ్ లో పొలిటికల్ ఫైట్ సాగుతోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదశ్ లో పంచాయతీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య నున్నానేనా అనే రేంజ్ లో పొలిటికల్ ఫైట్ సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిపై బెదిరింపులకు సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చెన్న అరెస్ట్ తో నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చితీరుతుందంని.., అప్పుడు తానే హోంమంత్రి అవుతానని జోస్యం చెప్పారు. చంద్రబాబుని అడిగి మరీ హోం మంత్రి పదవి తీసుకుంటాన్న అచ్చెన్న.. అప్పుడు ఎవర్నీ వదిలి పెట్టనని.. అందరి అంతూ చూస్తానంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు.

    తనపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీఐ, ఎస్సై తన బెడ్ రూమ్ లోకి వచ్చి దౌర్జన్యం చేశారని అచ్చెన్న ఆరోపించారు. తాను నిజంగా తప్పుచేశానని భావిస్తే చట్టప్రకారం అరెస్ట్ చేయాలని హితవు పలికారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. అచ్చెన్న పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ అధికారంలోకి రావడమనేది కల అని స్పష్టం చేశారు.




    అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఆమెపై పోటీకి అచ్చెన్నాయుడుకు వరసకు అన్న కుమారుడైన కింజారపు అప్పన్నను వైసీపీ బరిలో నిలిపింది. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ వెళ్లారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు కేవలం వైసీపీ అభ్యర్థిని తీసుకెళ్లి నామినేషన్ వేయించారు. ఇక, తాను నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారని అప్పన్న ఆరోపించారు.

    ఇది చదవండి: అలా చేస్తే ఊరుకునేది లేదు.. రాజ్యాంగం చెప్పిందే చేస్తున్నామన్న నిమ్మగడ్డ


    ఈ వివాదంపై కోటబొమ్మాళి పీఎస్‌లో 22 మందిపై కేసు నమోదు అయింది. నిన్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా.. అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ-1గా కింజారపు హరిప్రసాద్, ఏ -2గా కింజారపు సురేష్, ఏ-3గా కింజారపు అచ్చెన్నాయుడు, ఏ-4గా కింజారాపు లలితకుమారి పేర్లను చేర్చారు. అచ్చెన్న అరెస్ట్ నేపథ్యంలో గ్రామంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

    మరోవైపు అచ్చెన్నాయుడు అరెస్టును టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపుకు ఇది పరాకాష్ట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. మరోవైపు నిమ్మాడ బయలుదేరిన మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి నుంచి బయటకురాకుండా అడ్డుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP Politics, Chandrababu naidu, Gram Panchayat Elections, Kinjarapu Atchannaidu, Srikakulam, Tdp, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు