• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELUGU DESHAM PARTY MADE SENSATIONAL ALLEGATIONS ON YSRCP DRAGS PRASHANTH KISHORE INTO TEMPLES VANDALISM ISSUE PRN

AP Politics: ఆలయాలపై దాడులు వైసీపీ వ్యూహకర్త పనే..! టీడీపీ నేత సంచలన ఆరోపణలు..!

AP Politics: ఆలయాలపై దాడులు వైసీపీ వ్యూహకర్త పనే..! టీడీపీ నేత సంచలన ఆరోపణలు..!

సీఎం జగన్ తో ప్రశాంత్ కిషోర్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో హిందు ఆలయాలపై దాడులు (Hindu Temples Vandalism), విగ్రహాల ధ్వంసంపై రేగిన రాజకీయ రగడ ఇంకా చల్లారలేదు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party), తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో హిందు ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రేగిన రాజకీయ రగడ ఇంకా చల్లారలేదు. విగ్రహాల ధ్వంసాలపై ఓ వైపు సిట్ విచారణ జరుగుతుండగా... మరోవైపు ప్రభుత్వం పీస్ కమిటీలు ఏర్పాటు చేసింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ వ్యవహారానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. కొందరు నేతలు ఏకంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్న విధ్వంసమంటూ నేరుగా విమర్శల బాణాలు సంధిస్తున్నాయి. ఈ మాటల యుద్ధం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, అధికార వైసీపీ మధ్య రాజకీయ యుద్ధంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ అడుగు ముందుకేసిన టీడీపీ.. ఈ వ్యవహారంలోకి వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను లాగింది. ఇదంతా ఆయన ప్లానేనని ఆ పార్టీ అధికార ప్రతినిథి సుధాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

    ఇది పీకే వ్యూహమే..!
    రాష్ట్రం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే విగ్రహాల విధ్వంసాలకు పాల్పడుతున్నారని సుధాకర్ రెడి ఆరోపించారు. ఈ విధ్వంసాల వెనక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం దాగివుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ ను కలసిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అల్లరులు, అశాంతి సృష్టించేందుకు వ్యూహ రచన చేశారని తెలిపారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అండ ఉన్నందునే పోలీసులు నేరస్తులను పట్టుకోవడలో శ్రద్ద చూపడం లేదని ఘాటుగా విమర్శించారు. అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు దొంగిలించారు, రామతీర్థంలో రాముని విగ్రహ శిరస్సు భాగాన్ని కోశారని..,ఇంకా విగ్రహాలపై వరుసదాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.



    వైఎస్ విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తారు
    వైసీపీ విగ్రహాల రాజకీయం భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశముందని సుధాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మిళిలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల మఖాలు చెక్కేయడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. త్వరలో వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేసి ఆనేరాన్ని టీడీపీపై నెట్టేందుకు కట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు.  జగన్ పై కేసుల విచారణలు, పార్టీ నేతల అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టి మమరల్చేందుకు కుతంత్రాలు పన్నుతున్నారన్నారు.

    మరోవైపు వైసీపీ మాత్రం విగ్రహాల విధ్వంసం ముమ్మాటికీ టీడీపీ కుట్రలో భాగమేనని ఆరోపిస్తోంది. సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలా చేస్తున్నారని సీఎం జగన్ తో పాటు విజసాయి రెడ్డి, సజ్జల, బొత్స వంటి ముఖ్యనేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఏకంగా ప్రశాంత్ కిషోర్ నే వివాదంలోకి లాగడంపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
    Published by:Purna Chandra
    First published: