• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELUGU DESHAM PARTY LEADERS SLAMS SEC NIMMAGADDA RAMESH KUMAR OVER COMPLAINTS AGAINST YCP FULL DETAILS HERE PRN

SEC vs TDP: ఎస్ఈసీ విషయంలో వైసీపీ స్టాండ్ తీసుకున్న టీడీపీ... అసలేం జరిగిందంటే...

SEC vs TDP: ఎస్ఈసీ విషయంలో వైసీపీ స్టాండ్ తీసుకున్న టీడీపీ... అసలేం జరిగిందంటే...

సీఎం జగన్, ఎస్ఈసీ నిమ్మగడ్డ, టీడీపీ అధినేత చంద్రబాబు (ఫైల్)

AP Municipal Elections: పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections) ముగిసి మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు వైసీపీ (YSRCP) స్టాండ్ ను ప్రతిపక్ష టీడీపీ (Telugu Desham Party) తీసుకుంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల కమిషనర్ కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధం నడిచింది. కోర్టు తీర్పుల తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన పనిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాతి పరిణామాలతో నిమ్మగడ్డ విషయంలో అధికార పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు ముగిసి మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు వైసీపీ స్టాండ్ ను ప్రతిపక్ష టీడీపీ తీసుకుంది. ఎన్నికల కమిషనర్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరును టీడీపీ తప్పుబట్టింది. ఆయన వైఖరిపై అనుమానాలున్నాయంటూ బాంబు పేల్చింది.

    వివరాల్లోకి వెళ్తే.. మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ దారుణంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. విజయవాడలో రాజకీయ నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలతో పాటు టీడీపీ కూడా హాజరైంది. తమ అభ్యంతరాలను టీడీపీ నేతలు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఐతే ఎస్ఈసీ తీరును టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఇదేదో నామమాత్రంగా సమావేశం నిర్వహించినట్లుందని ఆరోపించారు. ఎస్ఈసీ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఎస్ఈసీకి చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఇటీవల నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల దాడులను వివరిస్తే కనీసం వినేందుకు కూడా ఎస్ఈసీ ఒప్పుకోలేదన్నారు. మీటింగ్ లో ఆయన చెప్పిందే వినాలనేట్టుందని.. రీ కౌంటింగ్ పై ప్రశ్నిస్తే అడగకూడదని ఎస్ఈసీ చెప్పినట్లు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరినా సమాధానం లేదన్నారు.

    ఇది చదవండి: అమిత్ షా తిరుపతి టూర్ రద్దు.. కారణం అందేనా..?



    అంతేకాదు ఎస్ఈసీపై అనుమానాలున్నాయాని.. నిమ్మగడ్డలో మార్పులు వచ్చాయన్నారు. ఈయన అప్పటి నిమ్మగడ్డ కాదని వర్ల రామయ్య అన్నారు. ఎస్ఈసీ మరీ దుర్గార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు కూడా. మొన్నటి వరకు ఎస్ఈసీ చర్యలను సమర్ధించిన తెలుగుదేశం పార్టీ నేతలు.. ఆయన్ను విమర్శించిన వారిపై ఇంతెత్తున లేచారు. సీన్ కట్ చేస్తే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయనపై రివర్స్ ఎటాక్ చేయడం కాస్త విడ్డూరంగానే ఉంది.

    ఇది చదవండి: అప్పుడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు.. సేమ్ సీన్ రిపీట్..



    ఇక ఇదే సమావేశానికి హాజరైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పాత్రం.. తమ విజ్ఞప్తులను ఎస్ఈసీకి చాలా అందించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆపార్టీ నేతలు కోరారు. వాలంటీర్లు మొబైలే ఫోన్లు తిరిగిచ్చేయాలన్న ఆదేశాలపై మాత్రం వైసీపీ అభ్యంతరం తెలిపింది. ఎన్నికల నిబంధనల పేరుతో వాలంటీర్ల వ్యవస్థను నిలిపేయడం సరికాదన్నారు.

    ఇది చదవండి: రేణిగుంట ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్... చంద్రబాబుకు నో పర్మిషన్...


    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు