Home /News /politics /

TELUGU DESHAM PARTY LEADERS ARRESTED ACROSS THE STATE AS YSCRP LEADERS COUNTERS OPPOSITION PARTY FULL DETAILS HERE PRN

AP Bandh: ఏపీలో టెన్షన్... టెన్షన్... వైసీపీ వర్సెస్ టీడీపీ... పేలుతున్న మాటల తూటాలు..

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయ (AP Politics) వాతావరణం వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కేంద్ర కార్యాలయంపై దాడిజరిగిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయ (AP Politics) వాతావరణం వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కేంద్ర కార్యాలయంపై దాడిజరిగిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ఏపీ బంద్ (TDP State Bandh) కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. దీంతో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాటలు చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (AP TDP Chief Kinjarapu Atchennaidu), మాజీ మంత్రులు దేవినేని ఉమా, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బండారు సత్యనారాయణ, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గన్నివీరాంజనేయులు, ఆనందరావు, సుగుణమ్మ, భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసులను దాటుకొని వాహనంలో వెళ్తుండగా అడ్డుకున్నారు.

  ఇక కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా బైక్ పై నిరసనకు వెళ్తుండగా అరెస్ట్ చేశారు. అరెస్టుకు ఆయన సహకరించకపోవడంతో బలవంతంగా వ్యానులో ఎక్కించుకెళ్లారు. శ్రీకాకుళంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడిని అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పలుచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు బస్సులను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక విజయవాడలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న కర్రలతో నిరసనకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దాడికి ప్రతిదాడే తమ విధానమని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గోడ దూకి బయకు వచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

  ఇది చదవండి: కేబినెట్ బెర్త్ కోసం ఊపందుకున్న లాబీయింగ్.. జిల్లాల వారీగా వినిపిస్తున్న పేర్లు ఇవే..!  ఇక టీడీపీ నేత పట్టాభిరామ్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో వంగవీటి రాధా ఘటనాస్థలిని పరిశీలించారు. పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించిన వంగవీటి రాధ... ఇళ్లపై దాడి చేయడంపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇళ్లపైకి వచ్చి మహిళలపై దాడి చేసి, చిన్న పిల్లలను భయబ్రాంతులకు గురిచేయడం నీచమైన చర్య అని విమర్శించారు. గుణదల నీచ రాజకీయాలు తిరిగి పురుడు పోసుకుంటున్నాయని వాటికి త్వరలోనే ముగింపు పలుకుతానని హెచ్చరించారు.

  ఇది చదవండి: సీఎం జగన్ సంచలన నిర్ణయాలు.. విజయసాయిరెడ్డి ఆ పదవికి కత్తెర.. ఆ నేతకు పదవి?  రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అరాచక పాలన సాగిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసింది కాకుండా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేయిస్తోందని మండిపడ్డారు. అన్యాయంగా దాడి చేయడమే కాకుండా.. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని మండిపడున్నారు.

  ఇది చదవండి: ఏపీలో ప్రతిరోజూ కరెంట్ కోతలు.. సోషల్ మీడియాలో వైరల్.. ప్రభుత్వ రియాక్షన్


  ఇదిలా ఉంటే టీడీపీ ఆరోపణలను వైసీపీ ఖండిస్తోంది. టీడీపీ కార్యాలయంపై చంద్రబాబే దాడిచేయించి ఇప్పుడు నాటకాలాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇలాంటివన్నీ అలవాటేనని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పట్టాభి చేసిన కామెంట్ ఎవరికి వర్తిస్తుందో వాళ్లే చెప్పాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల చరిత్ర అని చెప్పే చంద్రబాబు తన అనుచరులతో మాట్లాడించిన తీరుమన్నారు. పట్టాభితో మాట్లాడించింది చంద్రబాబేనని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు కష్టాలున్న సమయంలో విజయవాడలో లేని వ్యక్తి ముందస్తు ప్రణాళికల ప్రకారం రెచ్చగొట్టారని ఆరోపించారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tdp, Ysrcp

  తదుపరి వార్తలు