TELUGU DESHAM PARTY LEADER VARLA RAMAIAH DEMANDS CM JAGANMOHAN REDDY TO BE QUESTIONED IN HINDU TEMPLES VANDALASIM CASE PRN
AP Politics: సీఎం జగన్ ను విచారిస్తే నిజాలు తెలుస్తాయ్..! విగ్రహాల ధ్వంసంపై పోలీసులకు టీడీపీ సలహా..!
ఆలయాలపై దాడుల కేసులో సీఎం జగన్ విచారణకు వర్ల రామయ్య డిమాండ్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విగ్రహాల రాజకీయం రోజురోజుకీ ముదురుతోంది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress), తెలుగుదేశం (Telugu Desham Party) పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల రాజకీయం రోజురోజుకీ ముదురుతోంది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీపొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఆలయాలపై దాడుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారించాలని డిమాండ్ చేశారు. జగన్ కు 91 సీఆర్పీసీ కింద నోటీసులివ్వాలని లేఖలో పేర్కొన్నారు. నెల్లూరులో జరిగిన అమ్మఒడి సభలో జగన్ రాజకీయ ఉపన్యా సం చేశారని.., జగన్ మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు చెస్తున్నదెవరో తనకు తెలుసంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానిచ్చారని ఆరోపించారు. సీఎం ప్రసంగం ఆధారంగా డీజీపీ.. వైఎస్ జగన్ కు నోటీసులిచ్చి దేవాలయాలు ఎవరు ధ్వంసం చేశారో నిజం రాబట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దళితులపై దాడులకు సంబంధించి ఆరోపణలు చేసిన మాజీ ముఖ్యమంత్రికి నోటీసులిచ్చిన పోలీసులు., ప్రస్తుత ముఖ్యమంత్రికి నోటీసులివ్వడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ ఒకటేనని.., ఇందుకు ముఖ్యమంత్రి అతీతులు కాదన్నారు వర్ల రామయ్య. పోలీసులు ఈ విషయంలో దేనికి భయపడకుండా ముందుకెళ్లాలని వర్ల రామయ్య సూచించారు. అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా విగ్రహాల ధ్వంసానికి కారకులెవరో తెలుసన్నారని.. దీన్నిబట్టి చూస్తే ఇదంతా ముఖ్యమంత్రి, ఆయన సలహాదారులకు తెలిసే జరుగుతుందని వర్ల అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చే సమాచారం ద్వారా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడం కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు.
P.Kని లాగిన టీడీపీ
ఆలయాలపై దాడుల విషయంలో టీడీపీ ఒకింత దూకుడుగానే ముందుకెళ్తోంది. విధ్వంసాల వెనుక వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హస్తముందని టీడీపీ అధికార ప్రతినిథి సుధాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మర్చెందుకే విగ్రహాల విధ్వంసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ విధ్వంసాల వెనక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం దాగివుందని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అండ ఉన్నందునే పోలీసులు నేరస్తులను పట్టుకోవడలో శ్రద్ద చూపడం లేదని ఘాటుగా విమర్శించారు. అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు దొంగిలించారు, రామతీర్థంలో రాముని విగ్రహ శిరస్సు భాగాన్ని కోశారని..,ఇంకా విగ్రహాలపై వరుసదాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.