• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELUGU DESHAM PARTY LEADER MADE SENSATIONAL COMMENTS ON MUNICIPAL ELECTIONS SAID THAT HE WILL CAMPAIGN FOR JANASENA BJP CANDIDATES HERE ARE THE DETAILS PRN

Chinthamaneni Prabhakar: జనసేన-బీజేపీ తరపున ప్రచారం చేస్తా... చింతమనేని సంచలన వ్యాఖ్యలు

Chinthamaneni Prabhakar: జనసేన-బీజేపీ తరపున ప్రచారం చేస్తా... చింతమనేని సంచలన వ్యాఖ్యలు

చింతమనేని ప్రభాకర్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల్లో (Ap Municipal Elections) రాజకీయ వివాదం ముదిరిన పాకాన పడుతోంది. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ (YSR Congress Party), ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల (Telugu Desham party) మధ్య వైరం తారాస్థాయికి చేరింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ వివాదం ముదిరిన పాకాన పడుతోంది. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను బలవంతంగా విత్ డ్రా చేయించడమే కాకుండా.. తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, పుంగనూరులో టీడీపీ అభ్యర్థులు మూకుమ్మడిగా రాజీనామాలను విత్ డ్రా చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పలువురు కార్పొరేటర్ అభ్యర్థులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద హల్ చల్ చేశారు. సొంతపార్టీకి చెందిన కార్పొరేటర్ అభ్యర్థులపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

    టీడీపీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్న డివిజన్లలో బీజేపీ, జనసేన అభ్యర్థులు బరిలో ఉంటే వారి తరపున ప్రచారం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చింతమనేని కామంట్స్ తో ఏలూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డబ్బులకు ఆశపడి పార్టీని అమ్ముకున్నవారికి భవిష్యత్తు ఉండదన్న చింతమనేని.. పార్టీని నమ్ముకున్నవారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు అంతేలేకుండా పోతోందని విమర్శించిన చింతమనేని. అలాగే బెదిరింపులు, ప్రలోబాలకు తలొగ్గకుండా పార్టీ కోసం నిలబడిన వారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాని చింతమనేని అన్నారు.

    ఇది చదవండి: నిమ్మగడ్డకు హైకోర్టు షాక్... ఆ నామినేషన్లన్నీ రద్దు..



    మరోవైపు నామినేషన్ల విత్ డ్రాకు కొద్దిసేపటి ముందే పలువురు టీడీపీ నేతలు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు 33 వ డివిజన్ కు చెందిన మాజీ టీడీపీ కార్పొరేటర్ కరణం లోకేష్, శివలంక గంగాభవాని శారద, కరణం దుర్గారావు, డి నాగయ్య, కర్ర శివా లు 500 మంది టిడిపి కార్యకర్తలతో వైఎస్ఆర్ సిపి లోకి జాయిన్ అయ్యారు. అలాగే 33 వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కత్తిరి రామ్ మోహన్ రావు తన అనుచరులతో సహా వైసీపీలో చేరారు.

    ఇది చదవండి: ఏపీలో మళ్లీ పంచాయతీ ఎన్నికలు... ఆ గ్రామాలకు కొత్తగా నోటిఫికేషన్...


    ఇటు విజయవాడలోనూ వైసీపీ-టీడీపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా హెచ్చరించారు. టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలు మానుకోకుంటే పాత బెజవాడను చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు.  వైసీపీ బెదిరింపులు ఆపకపోతే ఎన్నికలు బష్కరిస్తామన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు