Home /News /politics /

TELUGU DESHAM PARTY HANDOVER TIRUPATHI MUNICPAL ELECTIONS TO ITS LEADER PATTABHIRAM AND HE TARGETED YSRCP MLA HERE ARE THE DETAILS PRN

AP Municipal Elections: తిరుపతిలో బెజవాడ రాజకీయం పనిచేస్తుందా...? వైసీపీకి ఆయన చెక్ పెడతారా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శ్రీవారి పాదాల చెంత వెలసిన దివ్యక్షేత్రం కావడంతో ప్రతి ఒక్కరి చూపు తిరుపతి (Tirupati) వైపే ఉంటుంది. అందుకే ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

    మునిసిపల్ కార్పొరేషన్స్ అయినప్పటి నుంచి ఎన్నికలకు నోచుకోని కార్పొరేషన్ అది. మేయర్ కుర్చీ కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్న స్థానికుల నాయకుల కల నెరవేరనుంది. ఇక్కడ ఏమి జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఇంతకీ ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏంటని అంటారా...20 ఏళ్ళ తరువాత మునిసిపల్ ఎన్నికలు తిరుపతి. శ్రీవారి పాదాల చెంత వెలసిన దివ్యక్షేత్రం కావడంతో ప్రతి ఒక్కరి చూపు తిరుపతి వైపే ఉంటుంది. అందుకే ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార పార్టీ దూకుడు పెంచి 50 డివిజన్లలో 22 డివిజన్లలో ఏకగ్రీవంగా కార్పొరేటర్లను గెలిపించుకున్నారు. మిగిలిన 27 డివిజన్లో విజయబావుటా ఎగుర వేయాలని వైసీపీ భావిస్తోంది. వివిధ కారణాలతో 1 వార్డులో ఎన్నికలు నిలుపుదల చేసారు.

    ఎన్నికలు జరుగుతున్న 27 డివిజన్లలలో కార్పొరేటర్ అభ్యర్థులు గెలిచే విధంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీ మాత్రం వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. తిరుపతి కార్పొరేషన్ ను టీడీపీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.., ఎన్నికల ప్రచార బాధ్యతలను రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కు అందించింది. మర్చి 1వ తేదీ నుంచి తిరుపతిలో మకాం వేసి ఎన్నికల సరళిని గమనిస్తూ... అధికార పార్టీ నాయకులను తనదైన శైలిలో విమర్శిస్తున్నారు పట్టాభి. తిరుపతిలో శుక్రవారం ఏర్పాటు చేసిన పట్టాభి.., తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రౌడీయిజం పతాకస్థాయికి చేరిందని ఆరోపించారు. టిటిడి ఛైర్మన్ గా పనిచేసిన వ్యక్తికి దేవుడంటే నమ్మకం, భయం లేదన్నారు. టిడిపి అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేయించింది తిరుపతి ఎమ్మెల్యేనని ఆరోపించారు. ఏకగ్రీవాల కోసం ఇంత దిగజారుడుకు దిగుతారా..? అంటూ విమర్శలు చేసారు.

    ఇది చదవండి: బస్సులోనే మహిళ మృతి... ఆర్టీసీ సిబ్బంది చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే...!



    మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి ఏజెంట్ లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారని...రిగ్గింగ్ కు వైసిపి నేతలు ప్లాన్ వేశారు చెప్పారు. తిరుపతి నగరంలో జరిగే ఎన్నికలకు కేంద్ర బలగాలను తీసుకురావాలి ఎన్నికల కమిషన్ ను కోరారు.తిరుపతి ఎన్నిక ప్రశాంతంగా జరగాలంటే ఎమ్మెల్యే భూమనను హౌస్ అరెస్ట్ చేయాలని... ఈరోజు నుంచే కరుణాకర్ రెడ్డి కదలికలపై పోలీసులు దృష్టి పెట్టాలి డిమాండ్ చేసారు. తిరుపతి బరిలో దిగడంతోనే వైసీపీ నేతలను టార్గెట్ చేసిన పట్టాభి.. మున్సపోల్స్ లో పసుపు జెండాను ఎగరేస్తారా..? లేదా..? అనేది వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Tdp, Ysrcp

    తదుపరి వార్తలు