• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELUGU DESHAM PARTY FACING HURDLES FROM OWN PARTY LEADERS THAT NEW RIFT IN VIJAYAWADA MP KESINENI NANI AND MLC BUDHA VENKANNA HERE ARE THE DETAILS PRN

Telugu Desham Party: అసలే ప్రతిపక్షం.. ఆపై గొడవలు.. ఇక గెలిచేదెట్టా...? తమ్ముళ్లు మారరా..?

Telugu Desham Party: అసలే ప్రతిపక్షం.. ఆపై గొడవలు.. ఇక గెలిచేదెట్టా...?  తమ్ముళ్లు మారరా..?

ప్రతీకాత్మక చిత్రం

Vijayawada: గతంలో 23 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాం.. చంద్రబాబు చేసింది తప్పు కాదా అంటూ కేశినేని నాని (Kesineni Nani) ప్రశ్నించారు.

  • Share this:
    ఎన్నికల్లో గెలవాలంటే నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలి. కేడర్ ను ముందుండి నడిపిస్తూ పార్టీని గెలిపించాలి. కార్యకర్తలకు చెప్పాల్సిన నేతలే కొట్టుకుంటే. విభేదాలతో రచ్చకెక్కితే. ఆ పార్టీ గెలుపు సంగతి దేవుడెరుగు.. అసలు పోటీనిస్తుందా..? ప్రస్తుతం విజయవాడలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాగే ఉంది. మున్సిపల్ ఎన్నికల వెళ బెజవాడ తెలుగుతమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. ఇన్నాళ్లు చాపకింద నీరులా ఉన్న వర్గపోరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాక్షిగా బయటపడ్డాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో చేయాల్సిన వ్యాఖ్యలు.. రోడ్డుపైనే వినిపించడం తమ్ముళ్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

    గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా రేగిన వివాదం పార్టీని ఇరుకునపెట్టింది. 39వ డివిజన్ అభ్యర్థిని రాత్రికి రాత్రే ఎంపీ కేశినేని నాని మార్చడం తీవ్ర వివాదాస్పదమైంది. 39వ డివిజన్ అభ్యర్థిగా పూజితకు బీఫారం ఇచ్చి ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోమనడం సరైంది కాదంటూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గం.. ఎంపీ కేశినేని నానిని నిలదీశింది. డివిజన్ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తీవ్రవాగ్వాదం జరిగింది. 11 నెలలుగా పార్టీకి అందుబాటులో ఉన్న పూజితను కాదని.. శివ అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేయించడంతో పూజితతో పాటు బుద్ధావెంకన్న వర్గం ఆందోళనకు దిగింది.

    పార్టీ మారిన వాళ్లని టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారని బుద్ధా వర్గీయులు ప్రశ్నించడంతో వారికి ఘాటుగానే సమాధానమిచ్చారు కేశినేని నాని. నేను తప్పు చేస్తే పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేసుకోండని స్పష్టం చేశారు. అంతేకాదు గతంలో 23 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాం.. చంద్రబాబు చేసింది తప్పు కాదా అంటూ ప్రశ్నించారు. నడిరోడ్డుపై అడ్డుకొని వాగ్వాదం చేస్తే పార్టీకే నష్టమని కూడా సెలవిచ్చారు.

    విజయవాడలో కొంతకాలంగా కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య అస్సలు పడటంలేదు. గతంలో ట్విట్టర్ సాక్షిగా ఇద్దరు నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఓకే పార్టీలో ఉంటూ వేర్వేరు పార్టీల నేతలు చేసుకున్నట్లు ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఎంపీ కేశినేని నాని అయితే అప్పుడప్పుడు పార్టీ తీరునే తప్పుబట్టారు. కూడా లోక్ సభలో పార్టీ నాయకుడి విషయంలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్పాత నాని కాస్త శాంతించారు.

    ఐతే బెజవాడలో ఎన్నికల నగారా మోగడంతో మళ్లీ అసంతృప్తులు, పాత గొడవలు రాజుకున్నాయి. అసలే పార్టీ ప్రతిపక్షంలో ఉంది. మరోవైపు అధికార వైసీపీ దూకుడుతో వెళ్తోంది. ఈ సమయంలో సొంతగొడవలతో రచ్చకెక్కింతే ఘోరపరాజయం తప్పదని కార్యకర్తలంటున్నారు. నేతలే కొట్టుకుంటుంటే తాము ఎలా ప్రచారం చేయాలని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిందేనంటున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు