• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELUGU DESHAM PARTY CONFIRMS KESINEN SWETHA AS MAYOR CANDIDATE FOR VIJAYAWADA MUNICIPAL CORPORATION IN MUNICIPAL ELECTIONS HERE ARE THE DETAILS PRN

AP Municpal Elections: టీడీపీ విజయవాడ మేయర్ అభ్యర్థి ఖరారు... పంతం నెగ్గించుకున్న ఎంపీ

AP Municpal Elections: టీడీపీ విజయవాడ మేయర్ అభ్యర్థి ఖరారు... పంతం నెగ్గించుకున్న ఎంపీ

కేశినేని శ్వేత (ట్విట్టర్)

Kesineni Swetha: శ్వేత అభ్యర్థిత్వంపై ఒకింత గందరగోళం నెలకొన్నా పార్టీ అదినేత చంద్రబాబు మాత్రం ఆమెకే ఓటు వేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నగరం విజయవాడ. కొత్త ప్రభుత్వం, రాజధాని తరలింపు నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పరేషన్ కు జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విజయవాడ మేయర్ పీఠం ఎవరదన్నదానిపై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న శ్వేత.. గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైనప్పుడే మేయర్ అబ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో టీడీపీ మేయర్ అభ్యర్థిపై కొంత వివాదం రాజుకుంది.

    టీడీపీలోని ఓ వర్గం శ్వేత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో సస్పెన్స్ నెలకొంది. ఐతే అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శ్వేత పేరును ఖరారు చేశారు. కేశినేని శ్వేతకు ఇవే మొదటి ఎన్నికలు. తొలిసారి ఆమె ఎన్నికల బరిలో దిగడంతో ఆమె తండ్రి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నీ తానే ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు శ్వేత కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తండ్రి తరపున ప్రచారం చేయడం ఆమెకు కలిసొచ్చిందని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు.

    ఇది చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయపరిమితి ఎంతో తెలుసా...?



    బరిలో దిగిన వెంటనే మేయర్ అభ్యర్థిత్వం దక్కించుకున్న శ్వేతకు.. ఆమె తండ్రి రాజకీయ అనుభవమే ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. సాధారణ ఎన్నికల్లో తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటుకి టీడీపీ పరిమితమైనా.. ఆయన మాత్రం ఎంపీగా విజయం సాధించారు. తనపై ప్రజల్లో ఉన్న నమ్మకం వల్లే గెలిచానని ఆయన చెప్తుంటారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అదే పేరు మరోసారి కలిసొస్తుందని నమ్ముతున్నారు. కేశినేని నాని విజయంలో శ్వేత పాత్ర కూడా ఉందని ఆమె సన్నిహితులు చెప్తుంటారు. ముఖ్యంగా ప్రత్యక్ష ప్రచారంతో పాటు సోషల్ మీడియా ప్రచారాన్ని ఆమె భుజాన వేసుకున్నారు. తన తండ్రితో పాటు ఇతర అభ్యర్థుల తరపున కూడా ప్రచారం చేశారు.

    ఐతే శ్వేత అభ్యర్థిత్వంపై ఒకింత గందరగోళం నెలకొన్నా పార్టీ అదినేత చంద్రబాబు మాత్రం ఆమెకే ఓటు వేశారు. మేయర్ అభ్యర్థిత్వంపై స్పష్టత రాకపోవడంతో ఇన్నాళ్లూ ఒకింత గందరగోళం నెలకొన్నా.. తాజా ప్రకటనతో మరింత స్వేచ్ఛగా ముందుకెళ్లే అవకాశముంది. ఇటీవల తన కామెంట్స్ తో టీడీపీలో కాక రేపిన కేశినేని నాని.. ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మరి ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు