TELUGU DESHAM PARTY ANNOUNCED MONEY FOR PEOPLE WHO EXPOSED YSRCP THREATENING DURING TIRUPATI BY POLL FULL DETAILS HERE PRN BK
Tirupati By-poll: ఫోన్ కొట్టు రూ.10వేలు పట్టు... తిరుపతి ఓటర్లకు టీడీపీ బంపర్ ఆఫర్..,
ప్రతీకాత్మక చిత్రం
తిరుపతి ఉపఎన్నిక (Tirupati By-poll) లో విజయం కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతోంది. ఇప్పటికే కాల్ సెంటర్ ప్రారంభించిన ఆ పార్టీ.. మరో కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఉపఎన్నికలో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. తిరుపతిలో గెలుపును సీరియస్ గా తీసుకున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపేస్తామంటూ వాలంటీర్లతో బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న టీడీపీ.. దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తోంది. వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ వైసీపీ నేతలు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీని కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ఓటు వేయకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల ఆగడాలను బయటపెట్టాలని అన్నారు.
ఎక్కడైనా బెదింపులకు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే ఈ నంబర్ కు సమాచారాన్ని అందించాలంటూ 7557557744 వాట్సాప్ నంబర్ ను విడుదల చేశారు అచ్చెన్నాయుడు. వైసీపీ నేతలు, వాలంటీర్ల ఆగడాలను కాల్ రికార్డుగానీ, ఫోటోగానీ తీసి వాట్సాప్ చేస్తే ఆ సదరు వ్యక్తుల ఎకౌంట్లో నేరుగా రూ.10వేలు జమచేస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు.
ఎన్నికల సందర్భంగా ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు పోతాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్ని.. ప్రజలకు తాము అండగా ఉంటామని అచ్చెన్న హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సీఎం జగన్ తన తండ్రి, తాతల డబబ్బుతో ఇవ్వడం లేదని.. అవి ప్రజల డబ్బులేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 10పైసలు ఇచ్చి 90 పైసలు దోచుకుంటోందన్నారు. సీఎం జగన్ కు బుద్ధి చెప్పాలంటే తిరుపతి ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
వాలంటీర్ల బాగోతాన్ని బయటపెట్టే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో టిడిపి ఎంపీ అభ్యర్థిని పనబాక లక్ష్మిని గెలిపించి జగన్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తాత,ముత్తాతలు వచ్చినా టిడిపిని ఏం చేయలేరన్నారు. గౌతమ్ సవాంగ్ వైసిపి కార్యకర్తగా మారిపోయారని.. డీజీపీ ఆదేశాలతోనే పోలీసులు రాష్ట్రంలో టిడిపి నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్నారని అచ్చమ నాయుడు ఆరోపించారు. 22మంది వైసిపి ఎంపిలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనన్న అచ్చెన్నాయుడు.., ప్రత్యేక పోదా, పోలవరం గురించి గురించి వైసిపి ఎంపిలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. భారీ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి రూ.600 కోట్లు, ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సొంత డబ్బా కొట్టుకునేందుకు రూ.500 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి జగన్ అంటూ విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.