Janasena-TDP: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో విచిత్ర పొత్తులు.. మిత్రులెవరో.. శత్రువులెవరో..!

ప్రతీకాత్మక చిత్రం

AP Politics: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎవరితో జతకడతాయో చెప్పడం కష్టం. నేడు తిట్టుకున్న పార్టీలు రేపు కలిసిపోవచ్చు.

 • Share this:
  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎవరితో జతకడతాయో చెప్పడం కష్టం. నేడు తిట్టుకున్న పార్టీలు రేపు కలిసిపోవచ్చు.. ఈ రోజు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన పార్టీలు రేపు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి సీన్లు తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఏపీలో టీడీపీ-జనసేన పార్టీలు ఎప్పుడో విడిపోయాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన పొత్తు.. 2019 ఎన్నికలు వచ్చేసరికి విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత పరిస్థితిల్లో జనసేన పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుంది. టీడీపీ ఒంటరిగానే ఉంది. ఐతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి అక్కడక్కడా సీన్ రివర్స్ అవుతోంది. అసలూ ఊహించన్ పొత్తులు.. మిత్రులతో రాజకీయం రంజుగా మారుతోంది. ఎవరు ఎవరితో చేతులు కలుపుతున్నారో కూడా అర్ధంకాని పరిస్థితులు నెలకొన్నాయి.

  పంచాయతీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ మద్దతుదారులు అక్కడక్కడా పరస్పర అవగాహనతో పనిచేశారు. కొన్నిచోట్ల జనసేన మద్దతుదారులు గెలిపిన పంచాయతీలను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. పార్టీ గుర్తులకు సంబంధించిన ఎన్నికలు కాదు కాబట్టి పంచాయతీ పోల్స్ పెద్దగా లెక్కలోకి రాలేదు. ఐతే మున్సిపల్ ఎన్నికల్లోనూ అక్కడక్కడా జనసేన-టీడీపీలు చేతులు కలుపుపుతున్నాయి. ఓ పక్క బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. అక్కడక్కడా సైకిలెక్కి ముందుకెళ్తోందన్న వాదన వినిపిస్తోంది. అటు టీడీపీయేమో సీపీఐతో స్నేహపూర్వక పొత్తుతో ముందుకెళ్తుంటే.. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనతో టీడీపీ చేతులుకు కలపడం ఆసక్తికరంగా మారింది.

  ఇది చదవండి: ఏపీలో నకిలీ వార్తలకు చెక్... కొత్త అస్త్రాన్ని ప్రయోగించిన జగన్  పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో టీడీపీ-జనసేన పొత్తుపెట్టుకున్నాయి. వార్డులను పంపుచుకొని మరీ ప్రచారం చేస్తున్నాయి. నర్సాపురంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఓ వైపు బీజేపీతో ఉంటూనే.. జనసేన నేతలు టీడీపీతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం విడ్డూరంగా మారింది. ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ అడుగు ముందుకేసి టీడీపీ పోటీలో లేని చోట జనసేన, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించారు.

  ఇది చదవండి: ఆ పథకం విషయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని మరిచారా...?  సిద్ధాంతాల పరంగా బీజేపీకి లెఫ్ట్ పార్టీలకు అస్సలు పడదు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీకి టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. 2019లో వామపక్షాలతో పొత్తుపెట్టుకున్న పవన్ ఇప్పుడు.. కాషాయపార్టీతో చేతులు కలిపారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో డైరెక్టుగా కాకపోయా.. పరోక్షంగా అయినా ఈ అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కడా ఒకరిచేతులు ఒకరు కలపనప్పటికీ పోటీ విషయంలో మాత్రం ఒకే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. మరి ఈ లోకల్ పొత్తులు పార్టీ పెద్దలు తెలిసే జరుగుతున్నాయా..? లేక ఎవరికి వారు నిర్ణయాలు తీసేసుకోని కండువాలు కలిపేసుకుంటున్నారా.? అనేది మాత్రం తేలాల్సి ఉంది.
  Published by:Purna Chandra
  First published: