Tirupati By-Poll: తిరుపతిలో పోటీపై డైలమాలో ఆ రెండు పార్టీలు.. అభ్యర్థిని ప్రకటించినా లాభం లేదా..?

ప్రతీకాత్మక చిత్రం

ఒక వేళ పనబాక లక్ష్మి (Panabaka Laxmi) పోటీ నుంచి త‌ప్పుకుంటే ఇప్పుడున్న ప‌రిస్థితిల్లో ఇప్ప‌టికిప్పుడు టీడీపీ (Telugu Desham party) నుంచి తిరుప‌తి (Tirupati) పోటీ చేయ‌డానికి అభ్య‌ర్ధ‌ని ఎంపిక చేయ‌డం త‌ల‌కుముంచిన భారం అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు.

  • Share this:
    మున్సిప‌ల్, పంచాయితీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపించింద‌నే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫ‌లితాలు ఎలా ఉన్న కీల‌క నేత‌లైన చంద్ర‌బాబు, సోమువీర్రాజు నియోక‌వ‌ర్గాల్లో కూడా వాళ్ల ప‌ట్టు క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు టీడీపీ, బిజేపీల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఈ ఫ‌లితాల షాక్ నుంచి తేరుకోక ముందే తిరుప‌తి పార్ల‌మెంట్ ఉపఎన్నిక‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల కావడంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో టెన్ష‌న్ వాత‌వ‌ర‌ణం నెల‌కొంది. ఇప్ప‌టికే టీడీపీ ప‌న‌బాక ల‌క్ష్మీని తిరుప‌తి నుంచి బ‌రిలో దింపే అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించారు. అయితే ప‌న‌బాక ల‌క్ష్మీ మాత్రం తాను తిరుప‌తి నుంచి పోటీ చేయ‌బోతున్న అభ్య‌ర్ధిని అనే విష‌యం మార్చిపోయారని సొంతపార్టీ నేతలే అంటున్నారు. తొలి నుంచి ఇక్క‌డ నంచి పోటీ చేయ‌డానికి స‌ముఖంగా లేని ప‌న‌బాక ల‌క్ష్మీ తాజాగా మున్సిప‌ల్, పంచాయితీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో బ‌రిలో ఉంటారా? ఉండ‌రా..? అనేదానిపై పార్టీలోనే సందేహాలు నెల‌కొన్నాయి.

    ఒక వేళ ఆమె బ‌రి నుంచి త‌ప్పుకుంటే ఇప్పుడున్న ప‌రిస్థితిల్లో ఇప్ప‌టికిప్పుడు టీడీపీ నుంచి తిరుప‌తి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్ధ‌ని ఎంపిక చేయ‌డం త‌ల‌కుముంచిన భారం అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పార్టికి ఉన్న వేవ్ చూస్తే ఇక్క‌డ నుంచి బ‌రిలో నిల్చొడానికి ఎవ‌రు ముందుకొచ్చే ప‌రిస్థితులు ఉండ‌క‌పోవ‌చ్చనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే మ‌రో ప్ర‌తిప‌క్ష పార్టీ బిజేపీది కూడా వింత ప‌రిస్థితే అని చెప్పుకోవాలి. ఇక్క‌డ పోటీ చేసిన అభ్య‌ర్ధికి డిపాజిట్లు కూడా వ‌స్తాయో రావో అనే సందేహాలు పార్టీలో సీనియ‌ర్ నేత‌ల‌కే ఉన్నాయ‌ని టాక్.

    తొలిత పొత్తులో భాగంగా జ‌న‌సేన సూచించిన అభ్య‌ర్ధికి సీటు కేటాయిస్తామ‌ని అనుకున్న త‌రువాత ప‌లు కార‌ణాల వ‌ల‌న బీజేపీ అభ్య‌ర్ధికే ఇక్క‌డ నుంచి బ‌రిలో దించ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. అయితే బ‌రిలో నిల‌వ‌డానికి ఎవ్వ‌రు ముందుకొచ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌ని వాపోతున్నారు పార్టీలో ప‌లువురు నేత‌లు. సీనియ‌ర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాస‌రి శ్రీనివాసులు బ‌రిలో నిలుస్తారనేది కూడా ఇప్పుడు సందేహాంగా ఉంది. మొన్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపి నుంచి పోటీ చేసిన అభ్య‌ర్ధ‌ల‌కు వ‌చ్చిన ఓట్లు చూస్తే ఇక్క‌డ ఆ పార్టీ ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇదిలా ఉంటే బిజేపీ రాష్ట్రా శ్రేణులు మాత్రం ఇక్క‌డ నుంచి త‌మ పార్టీ అభ్య‌ర్ధిని గెలిపిస్తే కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌నే ప్ర‌చారం కూడా చేస్తోన్నారు అయిన‌ప్ప‌టికి ఇక్క‌డ నుంచి బ‌రిలో నిల‌వ‌డానికి ముందుకు రావ‌డానికి జంకుతున్నార‌నే తెలుస్తోంది.

    ఇదిలా ఉంటే పుండుమీద కారం చ‌ల్లిన‌ట్లు జ‌న‌సేన స్థానిక శ్రేణులు మంగ‌ళ‌వారం స‌మావేశం ఏర్పాటు చేసుకోని ఈ ఎన్నిక‌లో నోటా కైన ఓటు వేధ్దాం కాని బిజేపీ మాత్రం వేయ్య‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తిరుపతిలో ప్రతిపక్షాల ప్రభావం అటుంచితే.. అసలు పోటీనిస్తాయా లేదా లేదా అనేది సందేహంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
    Published by:Purna Chandra
    First published: