టీడీపీకి ఘోర అవమానాలను తప్పించేది ఆయనే..?

150 మందికి పైగా ఎమ్మెల్యేలతో కళకళలాడిన పార్టీ.. ఇప్పుడు కేవలం 22 మంది ఎమ్మెల్యేలతో దీన స్థితిలో ఉంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలో. అప్పుడు కేవలం 23 సీట్ల నుంచి 151 సీట్లకు ఎగబాకింది. మొదటిది టీడీపీ కాగా, రెండోది వైసీపీ.

news18-telugu
Updated: December 13, 2019, 8:53 AM IST
టీడీపీకి ఘోర అవమానాలను తప్పించేది ఆయనే..?
చంద్రబాబు, లోకేశ్
  • Share this:
ఎంతలో ఎంత మార్పు..! 150 మందికి పైగా ఎమ్మెల్యేలతో కళకళలాడిన పార్టీ.. ఇప్పుడు కేవలం 22 మంది ఎమ్మెల్యేలతో దీన స్థితిలో ఉంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలో. అప్పుడు కేవలం 23 సీట్ల నుంచి 151 సీట్లకు ఎగబాకింది. మొదటిది టీడీపీ కాగా, రెండోది వైసీపీ. జగన్ పార్టీ అధికారం దక్కించుకొని దూకుడు ప్రదర్శిస్తుండగా, టీడీపీ అధికారం కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే.. ఎన్నడూ లేనంతగా తెలుగుదేశం పార్టీ సమస్యలు ఎదుర్కొంటోంది. అసెంబ్లీలో అయితే సీఎం జగన్‌ను, ఆయన సేనను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడుతోంది. వయసులో చిన్నవాడైన జగన్ దూకుడు ప్రదర్శిస్తూ.. ఎద్దేవా చేస్తుంటే చంద్రబాబు ఎదురు మాట్లాడలేకపోతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఎదురు మాట్లాడినా, దానికి తగ్గట్లు వైసీపీ చీఫ్ జవాబిస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలు టీడీపీ శ్రేణుల్లో నిరాశ పెంచుతోందని, ఇప్పటికే అధికారం కోల్పోయి కష్టాలు పడుతున్న పార్టీకి జగన్ వ్యూహాలు.. వైసీపీ నేతల తీరు.. మరింత ఇబ్బంది పెడుతోందని వివరిస్తున్నారు.

ముఖ్యంగా.. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తున్న టీడీపీ కార్యకర్తలు, నేతలైతే నిరాశతో కుమిలిపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి క్లిష్ట పరిస్థితులు టీడీపీకి ఎదురు కాలేదు. రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ అవమానాలు ఎదుర్కొన్నా వైఎస్ తన సమవుజ్జీ కావడం వల్ల ఆ ప్రభావం చంద్రబాబుపై ఎక్కువగా పడలేదని, కానీ.. జగన్ తనకన్నా చిన్నవాడు కావడం, రాజకీయ అనుభవం తక్కువగా ఉండటంతో జగన్ చేసే మాటల దాడితో టీడీపీ అధినేత సతమతమవుతున్నారని చెబుతున్నారు.

jr ntr master plan for political entry here are the details,Jr ntr,sr ntr,jr ntr sr ntr,jr ntr politics,jr ntr political entry,rrr,rrr movie,jr ntr sr ntr,jr ntr play sr ntr charecter,balakrishna jr ntr,jr ntr jayalalithaa,kanagana jr ntr sr ntr jayalalithaa,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా,సీనియర్ ఎన్టీఆర్ జయలలిత,కంగనా ఎన్టీఆర్ జయలలిత బయోపిక్,బాలకృష్ణ నందమూరి తారక రామారావు జయలలిత కంగనా రనౌత్ తారక్,తాత,పాలిటిక్స్‌లో తారక్,పాలిటిక్స్‌లో ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ నుంచి దాడిని ప్రతిఘటించాలంటే కొత్త శక్తి అవసరం అని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే ఛరిష్మా ఉన్న వ్యక్తి కావాలని అంటున్నారు పండితులు. ఆ ఛరిష్మా ఉన్న నేతగా జూనియర్ ఎన్టీఆర్ సరైన వ్యక్తి అని, ఆయన్ను రంగంలోకి దింపితే జగన్‌ను ఎదుర్కొనవచ్చని పార్టీలోని కొందరు గుసగుసలాడుకుంటున్నారట. పార్టీ ఉనికి కోల్పోకముందే చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, జూనియర్ ఎన్టీఆర్‌కు పగ్గాలు అప్పగించి, మార్గదర్శకుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారట. ఇప్పుడు పార్టీకి ఎదురవుతున్న ఘోర అవమానాల నుంచి తప్పించేది జూ.ఎన్టీఆర్ ఒక్కడేనని కూడా బాహాటంగానే చర్చించుకుంటున్నారట. మరి.. చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టి జగన్‌ను ఇరుకున పెడతారా? లేక.. పార్టీలో యువ రక్తానికి అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తారా? అన్నది చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 13, 2019, 8:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading