Chandrababu- Pawan Kalyan: టీడీపీ, జనసేన మధ్య మళ్లీ పొత్తు పొడుస్తోందా..? తిరుపతి ప్రచారంలో పవన్ గురించి చంద్రబాబు కామెంట్స్ కు అర్థమేంటి..?

చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ (ఫైల్ ఫొటోలు)

శుక్రవారం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య మళ్లీ పొత్తు పొడుస్తుందన్న అనుమానాలకు ఊతం కలుగుతోంది..

 • Share this:
  తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య మళ్లీ పొత్తు చిగుర్చనుందా? మరోసారి ఈ రెండు పార్టీలు జంట కట్టి ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగనున్నాయా? చంద్రబాబు, పవన్ కల్యాన్ ఒకే వేదికపై మళ్లీ కనిపించబోతున్నారా? జగన్ ను ఎదుర్కొనేందుకు పవన్ అభిమాన బలగం అవసరం కూడా ఉందని చంద్రబాబు భావిస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే సమయంలో శుక్రవారం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో ఆ అనుమానాలకు మరింత బలం పెరుగుతోంది. పవన్ అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బరిలోకి దిగినా అధికార వైసీపీని ఢీకొట్టలేకపోయాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. గుంటూరు, విజయవాడ, విశాఖలపై టీడీపీ ఆశలు పెట్టుకున్నా ఎన్నికల్లో అవేం పనిచేయలేదు. రాజధాని నినాదంతో విజయవాడ, గుంటూరులోనూ, స్టీల్ ఫ్యాక్టరీ అంశం ద్వారా విశాఖలోనూ పాగా వేయాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. తన రాజకీయ జీవితంలో ఓ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించడం ఇదే మొదటిసారి. అంతలా ఏపీలో అధికార వైసీపీ అన్ని గ్రామాల్లోనూ పాతుకుపోయింది. అధికార వైసీపీపై పట్టు సాధించాలంటే, ఆ పార్టీని ఓడించాలంటే పవన్ అండ కూడా కావాలని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు. జనసైన్యం తోడు కూడా ఉంటే జగన్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమకే పడతాయన్నది టీడీపీ అంచనా. అందుకే వ్యూహాత్మకంగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
  ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

  ‘దేశమంతటా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతోంటే ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. జగన్ నిర్వాకాలకు పవన్ కల్యాణ్ కూడా బాధితుడు అయ్యాడు. పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజయిన సందర్భాల్లో ప్రత్యేక షోలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు అందరికీ అనుమతులు ఇచ్చాం. రిలీజయిన తొలిరోజుల్లోనే ఆమోదయోగ్యమైన రీతిలో ధరలు పెంచుకుని నష్టాలు రాకుండా చూసుకుంటుంటారు. కానీ, పవన్ సినిమాకు ఏపీ సర్కారు ఆ అవకాశం ఇవ్వలేదు. తెలంగాణలో ఛాన్స్ ఇచ్చినా జగన్ మాత్రం అవకాశం ఇవ్వలేదు. పవన్ పై జగన్ కు ఎందుకు అంత కక్ష. మీ అరాచకాలను ప్రశ్నిస్తున్నారనేనా? ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నారనేనా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఇంకా ఎంతకాలం మీ దుర్మార్గం.’ అంటూ చంద్రబాబు కామెంట్స్ చేశారు.

  చంద్రబాబు వ్యూహాత్మకంగా ఓ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటారు. తన మనసులో ఉన్న మాటలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా పరోక్షంగా ప్రజల్లోకి ఆ భావాన్ని వెళ్లేలా చేస్తారు. టీడీపీతో జనసేన పార్టీ మళ్లీ జతకడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనను ప్రజల్లో క్రియేట్ చేయాలన్నది చంద్రబాబు భావనగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని మార్చుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న రభస, హైకోర్టును మార్చడం వంటి వాటిని వైసీపీ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సగటు ఏపీ పౌరుడిలో ఉంది. ఇటీవల ఓ సభలో పవన్ కల్యాణ్ కూడా ‘ఏపీకి కేంద్రంలో అన్యాయం జరుగుతోంటే 22 ఎంపీలు ఉన్నా కూడా జగన్ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఇంకో ఎంపీని గెలిపించమని కోరుతున్నారు. వైసీపీని తిరుపతిలో గెలిపించడం అవసరమా‘ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల్లో జగన్ పై విమర్శలు ఉన్నట్టుగానే, బీజేపీని కూడా ఇరుకున పెట్టేలా పవన్ వ్యాఖ్య చేశారు.
  ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!

  ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇటీవల తెలంగాణలో బీజేపీ నేతల తీరుతో పవన్ కాస్త అలకబూనారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆఖరు క్షణాల్లో తన మద్దతును టీఆర్ఎస్ అభ్యర్థికి పలికారు. వాస్తవానికి తిరుపతి ఎంపీ సీటులో జనసేన పోటీ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. బీజేపీ అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందనీ, జనసైనికులంతా ఎన్నికల్లో పనిచేస్తారని పవన్ చెప్పారు కానీ, ఆయన మాత్రం ప్రచారంలో పాల్గొనడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతల తీరుతో కూడా పవన్ కాస్త గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మరి చంద్రబాబు చేసిన కామెంట్స్ తో పవన్ ఏమైనా టీడీపీ వైపు మొగ్గుతారా? సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది కాబట్టి, ఆ లోపు జరగబోయే పరిణామాలు పవన్ మనసును మార్చుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
  Published by:Hasaan Kandula
  First published: