విశాఖ వాసులపై సినీనటుడు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యక్తిగతమైన అవసరాలతో బిజీ షెడ్యూల్‌ ఉన్నా కూడా.. విశాఖపై ఉన్న అభిమానంతోనే ఈ సమావేశానికి వచ్చినట్లుగా ఆయన తెలిపారు.

news18-telugu
Updated: February 8, 2020, 2:42 PM IST
విశాఖ వాసులపై సినీనటుడు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు
అలి
  • Share this:
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ పేరును ప్రభుత్వం ఖరారు చేయడంతో... ఇప్పుడంతా వైజాగ్ వైపే చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ క్యాపిటల్ అయితే చాలా బావుంటుందన్నారు. జగన్ మూడు రాజధానులకు ఆయన మద్దతు తెలిపారు. అయితే తాజాగా ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ విశాఖ జిల్లాకు వచ్చారు. చోడవరంలో జరిగిన ముస్లిం ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ప్రజలు తెలివైన వారన్నారు అలీ.  ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారన్నారు.దీంతోపాటు జగన్ ప్రభుత్వం అందిస్తున్న సేవలపై కూడా అలీ ప్రశంసల వర్షం కురిపించారు.

విశాఖ ప్రజలు చాలా తెలివైన వారితోపాటు మంచోళ్లని, ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసని సినీనటుడు అలీ అన్నారు. జిల్లాలోని చోడవరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ముస్లింలు మక్కా సందర్శన కోసం అందిస్తున్న ప్రయోజనాన్ని అర్హులంతావినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వైజాగ్ అంటే తనకు ప్రత్యేక అభిమానమన్నారు.  వ్యక్తిగతమైన అవసరాలతో బిజీ షెడ్యూల్‌ ఉన్నా కూడా.. విశాఖపై ఉన్న అభిమానంతోనే ఈ సమావేశానికి వచ్చినట్లుగా తెలిపారు. ‘లచ్చిమీ డోంట్‌ టచ్‌ మీ, బాగున్నారా బాగున్నారా’ అంటూ డైలాగ్‌లు చెప్పి అక్కడున్నవారందరిని నవ్వించారు. ఈ సందర్భంగా అలీని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఘనంగా సత్కరించారు.

ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో చేరారు. అప్పట్లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న అలీ జగన్ సూచనల మేరకు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తానన్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. పేకాటే పేకాటే తమ్ముడు తమ్ముడే అన్నట్టు స్నేహం స్నేహమే..రాజకీయాలు..రాజకీయాలే అంటూ ఆసక్తికర ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయితే.. తాను సక్సెస్ అయినట్టే భావిస్తానన్నారు. అంతకు క్రితం తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన విషయం నిజమేనని చెప్పుకొచ్చారు.

 

First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు