ప్రజల్ని డైవర్ట్ చేయడానికే తెరపైకి డేటాచోరీ.. సమగ్ర కుటుంబ సర్వేని తెలివిగా వాడుకున్న కేసీఆర్: శివాజీ

తెలుగు రాష్ట్రాల్లో డేటాచోరీ కేసు దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక సిట్‌లను ఏర్పాటు చేయడంతో.. పరిస్థితి మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో నటుడు, ఏపీ ప్రత్యేకహోదా సాధనాసమితి నాయకుడు శివాజీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. డేటా చోరీ అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: March 8, 2019, 5:53 PM IST
ప్రజల్ని డైవర్ట్ చేయడానికే తెరపైకి డేటాచోరీ.. సమగ్ర కుటుంబ సర్వేని తెలివిగా వాడుకున్న కేసీఆర్: శివాజీ
శివాజీ
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో డేటాచోరీ కేసు దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక సిట్‌లను ఏర్పాటు చేయడంతో.. పరిస్థితి మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో నటుడు, ఏపీ ప్రత్యేకహోదా సాధనాసమితి నాయకుడు శివాజీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. డేటాచోరీ అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటాచోరీకి మూల కారకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనని శివాజీ ఆరోపించారు. 2015లో జరిపిన సమగ్రకుటుంబ సర్వే ద్వారా ప్రజల వివరాలను కేసీఆర్ తెలివిగా వాడుకున్నారని, ఎస్ఆర్‌డీహెచ్ అనే యాప్‌ను పోలీసుశాఖతో తయారు చేయించి ఎన్నికల సంఘం సాయంతో.. జీహెచ్ఎంసీ, నిజామబాద్ ప్రాంతాల్లో భారీగా ఓట్లను తొలగించారని చెప్పాడు. ఇదే విధానాన్ని అంతటా అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలనూ ఆదేశించిందని చెప్పారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వెళుతోందని గతంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపైనా శివాజీ తీవ్ర ఆరోపణలు చేశారు. నమో యాప్ ద్వారా.. 24 కోట్ల కుటుంబాల (సుమారు 90 కోట్ల మంది ఓటర్ల) వివరాలను బీజేపీ కాజేసిందన్నారు. ప్రత్యేక హోదా అంశం, పనికిమాలిన రైల్వేజోన్‌ను ప్రకటించిన విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే  ఇప్పుడు డేటాచోరీ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు.

డేటాచోరీ కేసు పేరిట కంపెనీల మీద దాడులు చేయడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం తగ్గించేసిందని శివాజీ ఆరోపించారు. రెండు ప్రభుత్వాలు సిట్‌లు వేయడం ద్వారా ఏం సాధిస్తాయని ప్రశ్నించారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ పోలీసులు తెలంగాణకు రావొద్దనడానికి కేటీఆర్ ఎవరనీ.. రాజ్యాంగంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని గుర్తు చేశారు.
First published: March 8, 2019, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading