ఏపీలో ఎన్నికల ఫలితాలకు మరో మూడురోజుల సమయమే మిగిలుంది. దీంతో అన్ని పార్టీల్లో గెలుపోటములపై కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఇప్పటివరకు ఫలితాలపై కొనసాగిన అనేక సర్వేలు వైసీపీదే గెలుపుని నిర్ధారించాయి. అటు చాలామంది సీనియర్ నేతలు సైతం జగన్ ఈసారి గెలవడం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. ఏపీలో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డియేనని తేల్చేశారు. జగన్ పాదయాత్ర ద్వారా జనం మనసు గెలుచుకున్నారన్నారు కనకాల.ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆయన మాట్లాడారు. జగన్ తప్పకుండా సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబు పనైపోయిందని ఆయన రిటైర్మెంట్ తప్పదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా దేవదాస్ కనకాల స్పందించారు. పవన్ వ్యక్తిగతంగా చాలామంచి మనిషని ప్రశంసించారు. కాకపోతే పవన్ కల్యాణ్ మంచితనం ప్రాక్టికాల్గా పనిచేయదన్నారు. ఇక ఏపీ సీఎం తనయుడు నారా లోకేష్‌పై కూడా విమర్శలు చేశారు దేవదాస్. లోకేష్‌కు తాజాగా ఆయన పోటీకి దిగిన మంగళగిరి నియోజకవర్గం పేరు కూడా సరిగ్గా పలకడం రాదని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి నాయకులైతే రాజకీయం నవ్వుల పాలవుతుందంటూ ఆరోపణలు చేశారు కనకాల.
రు కూడా సరిగ్గా పలకడం రావడం లేదని విమర్శించారు. ఇలాంటి వాళ్లు నాయకులైతే రాజకీయం నవ్వుల పాలవుతుందన్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.